కెనడాలో భారతీయ విద్యార్ధి దారుణహత్య.. షాక్‌లో ఇండియన్ కమ్యూనిటీ , నివాళి
TeluguStop.com
ఇటీవల గ్రేటర్ టొరంటో ప్రాంతంలో హత్యకు గురైన భారతదేశానికి చెందిన విద్యార్ధికి స్థానికులు నివాళులర్పించారు.
పంజాబ్‌లోని నవన్‌షహర్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల గుర్విందర్ నాథ్( Gurvinder Nath ) జూలై 9న మిస్సిసాగా( Mississauga ) పట్టణంలో హత్యకు గురయ్యాడు.
టొరంటోలోని లాయలిస్ట్ కాలేజీలో బిజినెస్ చదువుతున్న నాథ్.తీవ్ర గాయాలతో జూలై 14న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఆ ప్రాంతంలోని ఇండో కెనడియన్ కమ్యూనిటీని ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇక్కడ చదువుకునే అంతర్జాతీయ విద్యార్ధులు( Foreign Students ) పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ.
తరచు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.నాథ్ హత్యకు సంతాపంగా స్థానికులు శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనని( Candlelight Vigil ) నిర్వహించారు.
నాథ్ స్నేహితుడు జస్వీందర్ మీలు మాట్లాడుతూ.గుర్విందర్ హత్య తమను షాక్‌కు గురిచేసిందన్నారు.
పీల్ రీజినల్ పోలీసులు విచారణ ప్రారంభించారని, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా జస్వీందర్ పేర్కొన్నారు.
నిందితులు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు.గుర్తు తెలియని నిందితులు బాధితుడిని తీవ్రంగా హింసించి రోడ్డుపక్కన వదిలేశారు.
నాథ్ కుటుంబానికి అండగా నిలిచేందుకు గాను అతని బంధువు బలరామ్ క్రిషన్ ఆన్‌లైన్‌లో నిధుల సేకరణను ప్రారంభించారు.
శుక్రవారం సాయంత్రం నాటికి దాదాపు 97,000 కెనడా డాలర్లు సమకూరాయి. """/" /
మరోవైపు.
నాథ్ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.అతని భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకునేందుకు గాను నాథ్ తండ్రి కెనడాకు( Canada ) వెళ్లాలనుకుంటున్నారు.
అయితే వీసా అందకపోవడంతో.నాథ్ భౌతికకాయాన్ని గురువారం భారత్‌కు తరలించే అవకాశం వుంది.
"""/" /
ఇకపోతే.గుర్విందర్ హత్యకు సంబంధించి పోలీసులు కొత్త వివరాలను మీడియాకు అందించారు .
బాధితుడు నడిపిన వాహనం లోపల అనేక సాక్ష్యాలను కనుగొన్నట్లు పేర్కొన్నారు.ఈ ఘటనలో పలువురు పాల్గొన్నట్లుగా చెప్పారు.
24 ఏళ్ల గుర్విందర్ నాథ్ జూలై 9న మిస్సిసాగాలోని బ్రిటానియా రోడ్, క్రెడిట్ వ్యూ రోడ్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మిస్సిసాగాలోని ఓల్డ్ డెర్రీ రోడ్ , ఓల్డ్ క్రెడిట్‌వ్యూ రోడ్ ప్రాంతంలో నాథ్ వాహనాన్ని పోలీసులు వెల్లడించారు.
సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!