అభ్యర్థులు ఖర్చుల నమోదులో తేడాలు లేకుండా చూసుకోవాలి

ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల నమోదులో తేడాలు లేకుండా చూసుకోవాలనీ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ (డా.

జగదీష్ సొంకర్ ) సూచించారు( Jagdish Sonkar ).సిరిసిల్ల, వేములవాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయాలలో ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థుల రోజువారి అకౌంట్ ల రెండవ తనిఖీని సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.

మణిగండసామి తో కలిసి చేపట్టారు.అభ్యర్థుల అకౌంటు పుస్తకాలు ,ఓచర్లు, బిల్లులను తగు వివరాలతో పరిశీలించారు.

క్రిమినల్ ఆంటిసిడెంట్స్ , సి -విజిల్( CVIGIL ), సువిధ , ఎంసీఏంసి తదితర అంశాల గురించి కూలంకషంగా వివరించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు అడిగిన సందేహాలను పరిశీలకులు నివృత్తి చేశారు.

ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధు సూదన్, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక అధికారిని స్వప్న, నోడల్‌ అధికారి రామ కృష్ణ, లైజన్ అధికారి నర్సింహులు ఉన్నారు.

ఆ ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్న శ్రీలీల.. ఈ హీరోయిన్ కు లక్ ఉందంటూ?