గ్రామాల్లో మొదలైన సర్పంచ్ అభ్యర్థుల సందడి…!

గ్రామాల్లో మొదలైన సర్పంచ్ అభ్యర్థుల సందడి…!

నల్లగొండ జిల్లా: మరో నెల రోజుల్లో తెలంగాణలో సర్పంచ్ ల పదవీకాలం ముగియనుండడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.

గ్రామాల్లో మొదలైన సర్పంచ్ అభ్యర్థుల సందడి…!

ఎలక్షన్ కమిషన్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుందన్న వార్తలు వెలువడడంతో గతంలో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతో పాటు కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు సైతం తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ పావులు కదుపుతున్నారు.

గ్రామాల్లో మొదలైన సర్పంచ్ అభ్యర్థుల సందడి…!

మొత్తం ఓట్లు ఎన్ని? అందులో ఎన్ని ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉంది?గతంలో గెలిచిన వారికి వచ్చిన ఓట్లు ఎన్ని? ఓడిన వారికి ఏయే వార్డుల్లో నష్టం జరిగింది? నాటి రాజకీయ పరిస్థితులు ఏమిటి? ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మనం ఎలా ముందుకు వెళితే బయట పడతామని లెక్కలు వేసుకుంటూ అనుచరులతో దావత్ లు ఏర్పాటు చేస్తూ బలనిరూపణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

మరోపక్క పార్టీ నేతల,ఎమ్మెల్యేల ఆశీర్వాదం కోసం ఆరాట పడుతున్నారు.రాష్టంలో అధికార మార్పిడి జరగడంతో పంచాయతీ రిజర్వేషన్లపై సర్వత్ర చర్చ జరుగుతుంది.

గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులకు సర్పంచ్ కావాలనే కోరిక అందని ద్రాక్షగానే మిగిలింది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి ఆశావాహుల సంఖ్య పదుల సంఖ్యలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

ఏదేమైనా స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్డులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయానేది రాజకీయ విశ్లేషకుల సైతం అంచనా వేస్తుండడంతో హస్తం అభ్యర్ధుల జాబిత ఎక్కువగానే ఉంటుందనే టాక్ నడుస్తోంది.

మొత్తం మీద "పంచాయితీ పోరు" ఈ సారి రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

రాజమౌళి మీద వచ్చిన వార్తల్లో నిజం లేదా..?

రాజమౌళి మీద వచ్చిన వార్తల్లో నిజం లేదా..?