రోజురోజుకీ పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు.. ఇది సోకడానికి ప్రధాన కారణాలు..

ప్రపంచ ప్రజలను ఎక్కువగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ఒకటి.క్యాన్సర్ అనేది శరీరంలోనీ ఒక అవయవానికి, కణజాలంలో మొదలై శరీరమంతా వ్యాపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా జనాలను బలి తీసుకుంటున్న వ్యాధులలో క్యాన్సర్ రాక్షసి రెండవ స్థానంలో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100కు పైగా క్యాన్సర్ వ్యాధి రకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

జీర్ణాశయ,ప్రేగులు, నోటి, అండాశయా క్యాన్సర్ ఇలా చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి.ప్రతి సంవత్సరం వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైనే అని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

కొన్ని దశల్లో క్యాన్సర్ ప్రాణాలను బలి తీసుకుంటూ మానవాళిపై దాడి చేస్తూ ఉంది.

"""/"/ ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన, నిరోధక చర్యలు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దీనంగా జరుపుకుంటారు.

క్యాన్సర్ వ్యాధి సొకడనికి గల ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.క్యాన్సర్స్ వ్యాధి సోకడనికి ముఖ్య కారణం పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు సేవించడం.

ఎందుకంటే ఇది నేరుగా ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. """/"/ స్మోకింగ్ చేసే వారి జీవితకాలం చాలా తక్కువగా ఉంటుందని చాలా పరిశోధనలు తెలిసింది.

ఊబకాయంతో బాధపడే వారిలో చాలా మంది లావుగా ఉండడం వల్ల తమ అందం దెబ్బతింటుంది అని మాత్రమే ఆందోళన చెందుతూ ఉంటారు.

ఇంకా లావుగా ఉండడం వల్ల అంద వికారంగా కనిపిస్తున్నాం అనే ఆందోళన చెందుతూ ఉంటారు.

కానీ లావుగా ఉండటం వల్ల కంటికి కనబడని మరో అతి పెద్ద సమస్య కూడా ఉంది అదే క్యాన్సర్.

లావుగా ఉండే వారిలో హై బీపీ, టైప్ టు డయాబెటిస్ సమస్యతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం, జంక్ ఫుడ్, నిల్వ చేసిన మాంసాన్ని తినడం లాంటి వాటికి కూడా ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

తమ్ముడు సినిమా శివరాత్రి కి వస్తుంది…సక్సెస్ అవుతుందా..?