సిద్ధూ మూసేవాలాకు కెనడియన్ల ఘన నివాళి.. ‘‘బ్రాంప్టన్’’లో చిరస్థాయిగా ఆయన పేరు ..!!
TeluguStop.com
ఈ ఏడాది మే 29న దుండగుల చేతిలో పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.
దీంతో యావత్ దేశం ఉలిక్కిపడింది.రాష్ట్రంలోని వీఐపీలకు భద్రతను ఉపసంహరిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే సిద్ధూ హత్య జరగడం సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే సిద్ధూని హత్య చేసినట్లు అంగీకరించింది.
కెనడాలో వున్న మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సాయంతో హత్య కుట్రను అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు.
అయితే తమ అభిమాన సింగర్ మరణాన్ని పంజాబీలు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో జూన్ 11న సిద్ధూ మూసేవాలా పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు ఘన నివాళులర్పించారు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు.
తాజాగా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో సిద్ధూ మూసేవాలా జ్ఞాపకార్థం ఒక చెట్టును నాటారు అక్కడి స్థానికులు.
నిజానికి బ్రాంప్టన్‌తో సిద్ధూకు అనుబంధం వుంది.2016లో ఉన్నత చదువుల కోసం కెనడాకు వచ్చిన సిద్ధూ బ్రాంప్టన్‌లోనే వున్నాడు.
అనంతర కాలంలో పాప్ సింగర్‌గా ఆయన భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
"""/"/
బ్రాంప్టన్ నగర మేయర్ పాట్రిక్ బ్రౌన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.స్థానిక సుఫాన్ ఫెన్నెల్ స్పోర్ట్స్ ప్లెక్స్‌లో సిద్ధూ మూసేవాలా జ్ఞాపకార్థం చెట్టును నాటినట్లు తెలిపారు.
తద్వారా ఆయన వారసత్వం బ్రాంప్టన్‌లో కొనసాగుతుందని పాట్రిక్ అన్నారు.సంగీత ప్రపంచం సిద్దూను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"""/"/
ఇకపోతే.సిద్ధూ మూసేవాలా రాపర్‌గా మారిన తర్వాత 2018లో ఆయన తొలి ఆల్బమ్ .
కెనడా బిల్‌బోర్డ్ ఆల్బమ్ చార్ట్‌లో చేరింది.అంతేకాదు ‘‘బీ టౌన్’’ అనే ఆల్బమ్‌ను రూపొందించి బ్రాంప్టన్ నగరంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు సిద్ధూ.
అలాంటి వ్యక్తి దారుణహత్యకు గురికావడంతో కెనడాలోని భారతీయ కమ్యూనిటీతో పాటు స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సిద్ధూ మూసేవాలా భారత్, అమెరికా, కెనడాలలో వరుస ప్రదర్శనలు ఇవ్వాల్సి వుంది.ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగానే ఈ దారుణం జరిగింది.
జూలై 23న కెనడాలోని వాంకోవర్, 24న విన్నిపెగ్, 30న టొరంటో, 31న కాల్గరీలో సిద్ధూ ప్రదర్శనలు ఇవ్వాల్సి వుంది.