భర్త మెడలో కుక్క గొలుసు.. వీధుల్లో తిప్పిన భార్య.. కారణం?

కరోనా వైరస్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది మనుషులు ఇంటికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే.

చైనా లోని వుహన్ నగరం లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజల ను వణికించేసింది.

కొన్ని నెలల పాటు లాక్ డౌన్ అంటూ ఇంట్లోనే ఉండేలా చేసింది కరోనా వైరస్.

ఇప్పటికి కొన్ని దేశాలలో కొన్ని కరోనా వైరస్ నియమాలు పాటిస్తున్నాయి.ఇక ఈ నేపథ్యంలోనే కెనడా లో కూడా రాత్రి పూట 8 దాటిన తర్వాత గుంపులుగా వెళ్లడానికి వీల్లేదు.

ఒక్క వ్యక్తి మాత్రమే ప్రయాణించాలి.ఒకవేళ రాత్రి 8 తర్వాత రావాలి అనుకుంటే వారితో పెంపుడు కుక్క ఉండాలి.

దీంతో ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

కరోనా నియమాలు పాటిస్తూ భర్తతో బయటకు వెళ్లేందుకు ఆ మహిళ చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

ఎందుకంటే ఆ మహిళ తాళి కట్టిన భర్త మెడకు కుక్క గొలుసు కట్టి అతడిని కుక్కలాగానే మోకాళ్ళు చేతుల తో నడిపించింది.

కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా భర్తను విధుల్లో తిప్పింది.ఈ విచిత్ర ఘటన కెనడాలోని క్యూబెక్ లో చోటు చేసుకుంది.

క్యూబెక్ సిటీకి చెందిన మహిళ తన భర్త మెడకు కుక్క గొలుసు కట్టి వీధుల్లో అతడితో షికారుకు వచ్చింది.

దీనికి కారణం కరోనా వైరస్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.రాత్రి గుంపులుగా తిరగకూడదు అనే ఒకే ఒక కారణంతో ఆమె తన భర్త ఇలా చేసినట్టు పోలీసులకు చెప్పుకొచ్చారు.

ఈ కథ అంతా విన్న పోలీసులు భార్యాభర్తలకు 1500 డాలర్లు జరిమానా విధించారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు స్వల్ప ఊరట