కెనడాలో భీకర వరదలు: బాధితుల కడుపు నింపుతోన్న సిక్కు సమాజం.. !!

మానవసేవే మాధవ సేవ అని నమ్ముతారు సిక్కులు.ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా సహాయ చర్యల్లో పాల్గొనడంతో పాటు చేతనైనంత సాయం చేస్తుంటారు.

కరోనా సమయంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వారికి కడుపు నింపారు సిక్కులు.ఇక ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సమయంలో నిరాశ్రయులైన వేలాది మందికి కూడా భోజనం పెట్టారు .

తాజాగా వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో ఎదురైన వరద విపత్తుతో కెనడా అతలాకుతలమైంది.

వాంకోవర్‌లో భీకర తుఫాన్ ధాటికి రోడ్లు, రైల్వే లైన్లు నామరూపాల్లేకుండా పోయాయి.వరదలకు తోడు కొండచరియలు విరిగి పడడంతో పరిస్థితులు భయానకంగా మారిపోయాయి.

నెల రోజుల్లో కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే కురిసిందని కెనడా వాతావరణ శాఖ చెబుతోంది.

మరోవైపు.భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

ఒక్క బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోనే వేలాది మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక బాధితులు అల్లాడుతూ సాయం కోసం కెనడా వాసులు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో అభాగ్యులను ఆదుకోవడానికి కెనడాలోని సిక్కు సమాజం రంగంలోకి నడుం బిగించింది.

వారికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తూ మద్ధతుగా నిలుస్తోంది.సర్రేలోని దుఖ్ నివారణ్ సాహిబ్ గురుద్వారాకు చెందిన వాలంటీర్లు సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొంటున్నారు.

బాధిత ప్రజలకు భోజనం, ఇతర సామాగ్రిని అందించేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌ను కూడా అద్దెకు తీసుకున్నారంటే.

సిక్కు సమాజం నిబద్ధత ఏంటో అర్ధం చేసుకోవచ్చు.దుఖ్ నివారణ్ సాహిబ్‌లో వాలంటీర్లు దాదాపు 3000 మందికి పైగా భోజనాలు సమకూర్చినట్లు తెలుస్తోంది.

"""/"/ హైవేపై బురదనీరు పేరుకుపోవడంతో వాలంటీర్లు బాధితులకు భోజనం అందించేందుకు గాను హెలికాఫ్టర్‌ను అద్దెకు తీసుకున్నారని అమర్‌జిత్ సింగ్ ధద్వార్ మీడియాకు తెలిపారు.

ఇతరులకు సహాయం చేయడం అన్నది సిక్కుల రక్తంలోనే వుందని ఆయన అన్నారు.గురుద్వారా అధ్యక్షుడు నరీందర్ సింగ్ వాలియా మాట్లాడుతూ.

వరదలు, కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని తెలిపారు.తాగేందుకు నీరు, తినడానికి తిండి లేక బాధితులు అల్లాడిపోయారని.

ఈ నేపథ్యంలోనే వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.దీనిలో భాగంగా దుప్పట్లు, ఇతర వస్తువులను వారికి అందజేయాలని ప్రయత్నిస్తున్నట్లు వాలియా చెప్పారు.

"""/"/ కెలోవ్నా, కమ్లూప్స్, మెట్రో వాంకోవర్‌లలోని ఖల్సా ఎయిడ్ కెనడా వాలంటీర్లు భోజనం వండుతున్నారు.

అలాగే హోప్, స్పెన్సెస్ బ్రిడ్జికి సామాగ్రిని చేరవేస్తున్నారు.హోప్ విమానాశ్రయం సమీపంలో చిక్కుకుపోయిన 200 మంది ట్రక్కర్లకు ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖల్సా ఎయిడ్ లోయర్ మెయిన్ ల్యాండ్ కో ఆర్డినేటర్ బల్జీత్ లాలీ చెప్పారు.

శ్రియ అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా  రోజురోజుకు చిన్నపిల్లలా అవుతున్నావుగా?