ప్రధాని భార్య కు కు కూడా కరోనా, ఆందోళన చెందుతున్న ప్రజలు
TeluguStop.com
ప్రపంచ దేశాలను వణికించేస్తుంది ఈ కరోనా వైరస్.రాజు-పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ కరోనా పలకరించుకుంటూ పోతుంది.
ఎవరు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ వైరస్ భారీ న పడి అందరూ అతలాకుతలం అయిపోతున్నారు.
ఇప్పటి వరకు సామాన్యుల కంటే కూడా సమాజంలో ఒక స్థాయి లో పేరున్న రాజకీయ నేతలను ఎక్కువగా ఈ వైరస్ పలకరిస్తుంది.
మొన్న ఇరాన్ లో ఎంపీలు,మంత్రులకు సోకిన ఈ వైరస్ ఆ తరువాత స్పెయిన్ మంత్రి,ఉపప్రధాని లను కూడా పలకరించింది.
అయితే ఇప్పుడు తాజాగా కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీ కు కూడా ఈ వైరస్ సోకినట్లు తెలుస్తుంది.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ధ్రువీకరిస్తూ ప్రకటన చేసింది.ఓ వేడుకకు బ్రిటన్ వెళ్లి వచ్చిన ఆమె అనారోగ్యం పాలవడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా.
కరోనా సోకినట్లు తేలింది.అయితే ఆ విషయం తెలీగానే.
కెనడా మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆమెతో పాటు ప్రధాని ట్రూడో కూడా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు ప్రకటించారు.
తన భార్యకు ఫ్లూ లక్షణాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా తాను కూడా ఇంటి వద్దనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ట్రూడో వెల్లడించారు.
ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సలహాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మరోపక్క వారం నుంచి సోఫీని కలిసిన వారందరినీ కూడా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ తెలిపారు.
దాదాపు 14 రోజుల పాటు ప్రధాని, ఆయన భార్య సోఫీ ఇంటికే పరిమితం కానున్నారని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే కెనడాలో 138 మందికి ఈ వైరస్ బారిన పడ్డారు.
కాగా.అమెరికాలో ఇప్పటి వరకు 1758 మంది కరోనా తో బాధపడుతుండగా,41 మంది మృత్యువాతపడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరుగుతూ పోతున్నాయి.
రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…