ఆవిరైన డాలర్ డీమ్స్ : అమెరికా చేరకుండానే జలసమాధి, మృతుల్లో నలుగురు భారతీయులు .. 4 నెలల తర్వాత వెలుగులోకి
TeluguStop.com
అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.
అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.
"""/" /
తాజాగా అమెరికా( America )కు అక్రమంగా వెళ్లే క్రమంలో రెండు కుటుంబాలకు చెందిన 8 మంది జలసమాధి అయ్యారు.
వీరిలో నలుగురు సభ్యుల భారతీయ కుటుంబం కాగా.మరొకరు రొమేనియా చెందిన ఫ్యామిలీ.
ఈ ఘటన నాలుగు నెలల క్రితం జరగగా ఇప్పుడు పూర్తి వివరాలు వెలుగుచూశాయి.
ఈ ఏడాది మార్చి 29న కెనడాలోని సెయింట్ లారెన్స్ నది( Saint Lawrence River )లో అక్రమ వలసదారులతో వున్న పడవ మునిగిపోయింది.
దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు నదిని జల్లెడపట్టి తొలి రోజు ఆరుగురు, మరుసటి రోజు మరో రెండు మృతదేహాలను వెలికితీశారు.
భారత్‌కు చెందిన వారిని ప్రవీణ్ చౌదరి, ఆయన భార్య దక్షాబెన్, వారి కుమార్తె విధి, కుమార్ మేత్‌గా గుర్తించారు.
"""/" /
అయితే వీరిని పడవలో అక్రమంగా కెనడా నుంచి అమెరికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన కేసీ ఓక్స్ అనే వ్యక్తి జాడ మాత్రం తెలియరాలేదు.
దీనిపై ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అప్పటి నుంచి నెల రోజుల పాటు సెయింట్ లారెన్స్ నదిలో గాలించారు పోలీసులు.
వారి ప్రయత్నాలు ఫలించి ఈ నెల 3న నదిలో ఓ గుర్తు తెలియని శవం దొరికింది.
దీనికి నిర్వహించిన పరీక్షల్లో అది ఓక్స్‌దిగా తేలింది.ఇకపోతే.
గతేడాది జనవరిలో అమెరికా - కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
మృతులను జగదీష్ పటేల్( Jagdish Patel ), అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు విహంగీ పటేల్, ధార్మిక్ పటేల్‌గా గుర్తించారు.
వీరి మృతదేహాలు విన్నిపెగ్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో వున్న ఎమర్సన్‌కు తూర్పున మంచు కప్పబడిన పొలంలో కనిపించాయి.
వీరు కూడా గుజరాతీయులే కావడం గమనార్హం.
ప్రియాంక చోప్రా నా రోల్ మోడల్.. తదుపరి సినిమా వారితోనే: సమంత