కెనడాలో గురుద్వారాపై రెచ్చగొట్టే రాతలు.. అనుమానితుల ఫోటోలు విడుదల
TeluguStop.com
కెనడాలోని గురుద్వారా, హిందూ ఆలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చిరాతలు రాసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారత్ నుంచి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కెనడా పోలీసులు( Police Of Canada ) ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించారు.
గత శనివారం తెల్లవారుజామున వాంకోవర్‌లోని చారిత్రాత్మక గురుద్వారా వెలుపల సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తుల ఛాయా చిత్రాలను కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విడుదల చేశారు.
ఈ ఘటన వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టడానికి అధికారులు ప్రజల సహాయాన్ని కోరారు.
శనివారం తెల్లవారుజామున ఖల్సా దివాన్ సొసైటీ (కేడీఎస్) రాస్ స్ట్రీట్ గురుద్వారాపై ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక గ్రాఫిటీలు స్ప్రే చేయబడ్డాయి.
ఈ ఘటనపై గురుద్వారా మేనేజ్‌మెంట్ తక్షణం స్పందించింది.ఈ విధ్వంసం వెనుక వేర్పాటువాద ఖలిస్తాన్ అనుకూల శక్తుల హస్తం ఉందని ఆరోపించింది.
వాంకోవర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ( Vancouver Police Department )(వీపీడీ) సైతం ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న వాహనం ఫోటోలను విడుదల చేసింది.
ఈ చిత్రాలలో ఉన్న వ్యక్తులను, వాహనాన్ని గుర్తిస్తే దానికి సంబంధించిన సమాచారాన్ని మాతో పంచుకోవాలని అధికారులు కోరారు.
"""/" /
ఏప్రిల్ 19న జరిగిన ఈ సంఘటనపై వీపీడీ క్రిమినల్ దర్యాప్తును ప్రారంభించింది.
ఘటనాస్థలం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆధారాలను సేకరించి విశ్లేషిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ ప్రదేశంలో సంచరించిన తెలుపు రంగు పికప్ వ్యాన్, ఇద్దరు వ్యక్తుల చిత్రాలను సీసీటీవీ ఫుటేజ్ నుంచి సేకరించారు.
ఏప్రిల్ 19న తెల్లవారుజామున 4 నుంచి 4.30 గంటల సమయంలో సదరు ట్రక్కు ఈ ప్రాంతం గుండా వెళ్లిందని అధికారులు భావిస్తున్నారు.
ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు గురుద్వారా ముందు ద్వారం వరకు నడిచారు.వీరిలో ఒకరు పసుపు రంగు టోపీ, పసుపు రంగు జాకెట్, నల్ల ప్యాంట్ ధరించారు.
మరో వ్యక్తి బూడిద రంగు హుడీ, నల్ల ప్యాంట్ ధరించినట్లు అధికారులు తెలిపారు.
"""/" /
1906లో స్థాపించిన ఈ గురుద్వారాలో గత వారాంతంలో వైశాఖి పరేడ్, నగర్ కీర్తన్‌ను( Vaisakhi Parade, Nagar Kirtan ) నిర్వహించారు.
ఇందులో ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు పాల్గొనకుండా నిషేధించారు.శనివారం రాస్ స్ట్రీట్ గురుద్వారాతో పాటు బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న లక్ష్మీ నారాయణ్ మందిర్‌ను కూడా ఖలిస్తాన్ వేర్పాటువాదులు లక్ష్యంగా చేసుకున్నారు.