నిజ్జర్ హత్యకు ఏడాది : కెనడా పార్లమెంట్‌లో శ్రద్ధాంజలి .. ఉగ్రవాదికి ఇలా చేస్తారా అంటూ నెటిజన్ల ఫైర్

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య రాజుకున్న అగ్గి నేటికీ చల్లారలేదు.

భారత్ మాత్రం తమపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు సాక్ష్యాలు చూపాల్సిందేనని పట్టుబడుతోంది.అలాగే నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉందంటూ ఇప్పటికే కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌, అమన్‌దీప్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్‌ సిటీలో కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.

"""/" / ఈ నేపథ్యంలో మరోసారి ట్రూడో( Justin Trudeau ) సర్కార్ తీరు భారత్‌కు ఆగ్రహం తెప్పించింది.

నిజ్జర్ హత్య జరిగి జూన్ 18కి ఏడాది పూర్తయిన సందర్భంగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అతనికి నివాళులర్పించింది.

ఏకంగా దేశ పార్లమెంట్‌లోనే సంతాప కార్యక్రమం నిర్వహించగా, ఎంపీలంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మౌనం పాటించారు.

దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించగా, ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తికి పార్లమెంట్‌లో నివాళులర్పించడం ఏంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

"""/" / కాగా.గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలోని ఓ గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

దీని వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ ట్రూడో వ్యాఖ్యానించారు.నిజ్జర్ స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్ ( Jalandhar )నగర శివారులోని భార్‌సింగ్ పుర .

1997లో కెనడాకు వలస వెళ్లిన నిజ్జర్ .అక్కడ ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సన్నిహిత సంబంధాలు నెరిపేవాడు.

ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఏర్పాటు చేసి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు కెనడాలోని సిక్కు యువతలో ఖలిస్తాన్ భావజాలాన్ని నూరిపోసేవాడు.

దీంతో 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

మొదలైన వరలక్ష్మి పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోస్!