మన దేశ గర్భవతులు కెనడాకి ఎందుకు వెళ్తున్నారో తెలుసా.. ఈయన మాటలు వింటే..?
TeluguStop.com
కెనడా దేశస్థులు గత కొంతకాలంగా భారతీయులను తీవ్రంగా ద్వేషిస్తూ వస్తున్నారు.వారు అలా ద్వేషించడానికి కారణాలు అనేకం అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కెనడియన్ పౌరుడు చాడ్ ఎరోస్( Chad Eros ) తన సోషల్ మీడియా పోస్ట్‌తో ఓ పెద్ద వివాదాన్ని క్రియేట్ చేశాడు.
భారతీయ మహిళల ప్రసవాలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో, కెనడాలోని చిల్డ్రన్ కేర్ వార్డులు భారతీయ గర్భవతులతో( Pregnant Indian Women ) నిండిపోతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ మహిళలు తమ పిల్లలు కెనడాలో( Canada ) జన్మించి ఆ దేశ పౌరత్వం పొందాలనే ఉద్దేశ్యంతో కెనడా వస్తున్నారని ఆయన వాదించారు.
ఈ వాదనకు ఆధారంగా ఎరోస్ తన అక్క కూతురు తాజాగా ఒక స్థానిక ఆసుపత్రిలో ప్రసవించిన సంఘటనను వివరించారు.
ఆ సమయంలో అక్కడికి చాలా మంది భారతీయ మహిళలు కెనడాలో ప్రసవించేందుకే వచ్చారట.
కెనడా ఆసుపత్రులు అందరికీ చికిత్స చేయడంలో తప్పు లేదని, కానీ భారతీయ మహిళలు కెనడియన్ పౌరులకు ఉపయోగపడే స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
"""/" /
చాడ్ ఎరోస్ అనే కెనడియన్ పౌరుడు తన వీడియోలో భారతీయ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి.
ఆయన వాదన ప్రకారం, కెనడా ఆసుపత్రులు( Canada Hospitals ) భారతీయ మహిళలకు అందించే వైద్య సేవలకు బిల్లులు పంపినప్పటికీ, వారి నుంచి చెల్లింపులు వసూలు చేయడం కష్టమే.
ఎందుకంటే వారికి కెనడియన్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు.అంతేకాకుండా, ఈ మహిళలు ప్రసవించిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
"""/" /
ఈ పిల్లలు పెద్దయ్యాక కెనడా పౌరులుగా( Canada Citizenship ) మారి తమ కుటుంబాలను కెనడాకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని ఎరోస్ చెప్పారు.
ఆయన పోస్ట్‌కు ఇప్పటికే 8,30,000కు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.
కొంతమంది కెనడియన్లు ఎరోస్ వాదనను సమర్థిస్తూ, ప్రభుత్వం ఈ విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
కెనడాలో జన్మించిన ప్రతి బిడ్డకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని కొందరు సూచిస్తున్నారు.
అయితే, మరికొందరు ఈ సమస్యకు కారణం కెనడా నిబంధనలేనని, భారతీయ మహిళలను నిందించడం సరికాదని వాదిస్తున్నారు.
ఇది కదా తెలివంటే.. భర్త సీక్రెట్ ఎఫైర్ గుట్టు రట్టు చేసిన భార్య..