కెనడా వీసా కోసం ట్రై చేస్తున్నారా.. మీకో గుడ్‌న్యూస్ .. !!

కెనడా వీసా( Canadia Visa ) కోసం ట్రై చేస్తున్న వారికి ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

జూన్ నెలకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ డ్రాకి ( Express Entry Draw )4,800 మంది దరఖాస్తుదారులకు ఆహ్వానాలు పంపింది.

Comprehensive Ranking System (CRS)లో కనీసం 486 స్కోర్‌ సాధించిన వారు డ్రాకు అర్హులని తెలిపింది.

ఎకనామిక్ ఇమ్మిగ్రేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ కింద మే 24న జరిగిన డ్రాకు అనుగుణంగా ఈ ప్రకటన వెలువడింది.

ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ).ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అభ్యర్ధుల కోసం కేటగిరీ ఆధారిత ఎంపికను ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేటగిరీ ఆధారిత ఎంపికలో .బలమైన ఫ్రెంచ్ భాషా ప్రావీణ్యం , ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, STEM వృత్తులు, వడ్రంగులు, ప్లంబర్లు, రవాణా వంటి రంగాల్లో పనిచేసిన అనుభవం వున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

"""/" / అయితే ఈ వేసవిలోనే కేటగిరీ ఆధారిత డ్రాలను నిర్వహించాలని ఐఆర్‌సీసీ భావిస్తోంది.

కానీ ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు.2023లో ఇప్పటి వరకు 49,948 మంది అభ్యర్ధులు 13 డ్రాలకు ఆహ్వానించబడ్డారు.

దేశంలో కోవిడ్ 19 పరిస్ధితులు చక్కబడినప్పటికీ గతేడాది జూలై వరకు ఇమ్మిగ్రేషన్ శాఖ ఎలాంటి డ్రాలను నిర్వహించలేదు.

ఆ తర్వాతి నుంచి పరిస్ధితుల్లో మార్పులు మొదలయ్యాయి.కాగా.

ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ ప్రోగ్రామ్, కెనడియన్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్, ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్‌లోని కొంత భాగం ద్వారా శాశ్వతంగా కెనడాకు వలస రావాలనుకునే వారి కోసం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీని రూపొందించారు.

ఇందులో దరఖాస్తుదారుడి పని అనుభవం, వృత్తి, భాషా సామర్ధ్యం, విద్య, వయస్సు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుంటారు.

అలాగే మెరుగైన సీఆర్ఎస్ స్కోరును కలిగివున్న దరఖాస్తుదారులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడతారు.

"""/" / కాగా.కరోనా వైరస్, లాక్‌డౌన్ ఇతరత్రా కారణాల వల్ల కెనడా ఇప్పుడు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

తాజాగా ఈ జాబితాలో అక్కడి వ్యవసాయ రంగం కూడా చేరినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

దీని నుంచి గట్టెక్కాలంటే 30 వేల మంది శాశ్వత వలసదారులు కావాలని నిపుణులు చెబుతున్నారు.

రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా (ఆర్‌బీసీ)( Royal Bank Of Canada ) నివేదిక ప్రకారం.

2033 నాటికి కెనడియన్ ఫార్మ్ ఆపరేటర్లలో 40 శాతం పదవీ విరమణ చేయనున్నారు.

ఇది రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి శరాఘాతంగా చెబుతున్నారు.అదే సమయంలో 24 వేలమంది సాధారణ వ్యవసాయ, నర్సరీ, గ్రీన్‌హౌస్ విభాగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందని అంచనా.

ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న నిర్వాహకులలో 60 శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారేనని నివేదికలు చెబుతున్నాయి.

వీటితో పాటు 66 శాతం మంది ఉత్పత్తిదారులకు వారసత్వ ప్రణాళిక లేదని, దీని వల్ల వ్యవసాయ భూముల భవిష్యత్తు సందేహాస్పదంగా మారుతుందని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ అధ్యయనం తెలిపింది .

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?