సుంకాల యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్‌ను ఢీకొడుతోన్న కెనడా నేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )తన దూకుడైన నిర్ణయాలతో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నారు.

ఉక్రెయిన్ - రష్యా వార్‌ను ( Ukraine-Russia War)ఆపాలని కంకణం కట్టుకున్న ఆయన ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

ఇక కెనడా, చైనా, మెక్సికోలపై భారీగా పన్నులు పెంచి సుంకాల యుద్ధానికి తెరదీశారు.

మిత్రులు, శత్రువులు అన్న తేడా లేకుండా అందరిపై పన్నులు విధిస్తున్న ట్రంప్ భారత్‌పైనా ప్రతీకార సుంకాలు విధించారు.

దీంతో అగ్రరాజ్యంతో సంప్రదింపులు జరుపుతోంది భారత ప్రభుత్వం.ఇక కెనడాది మరో కథ.

అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా కలిసిపోవాలని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడంతో పాటు భారీగా పన్నుల భారం మోపారు.

దీంతో కెనడా అధినాయకత్వం ట్రంప్‌పై కారాలు మిరియాలు నూరుతోంది.ప్రధానిగా ట్రూడో ఉన్న చివరి రోజుల్లో అమెరికాతో కఠినంగానే ఉన్నారు.

ఇప్పుడు కొత్తగా ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీ( Mark Carney ) కూడా జస్టిన్ ట్రూడో బాటలోనే నడుస్తానని సంకేతాలు ఇచ్చారు.

అయితే ఆశ్చర్యకరంగా కెనడాలోని ఓ ప్రావిన్స్ అధినేత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు.

"""/" / ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ( Ontario Premier Doug Ford ).

ట్రంప్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.కెనడాపై 25 శాతం అదనపు సుంకాలు విధించినందుకు ప్రతీకారంగా అమెరికాలోని మిన్నెసోటా, న్యూయార్క్, మిచిగాన్‌ రాష్ట్రాలలోని 1.

5 మిలియన్ల ఇళ్లకు పంపే విద్యుత్‌పై 25 శాతం ఎగుమతి పన్ను విధిస్తామని ఫోర్డ్ హెచ్చరించారు.

ముందస్తు ఎన్నికలకు కెనడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్‌తో వాణిజ్య యుద్ధంపై డగ్ ఫోర్డ్ గళమెత్తుతున్నారు.

ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను మార్కెటింగ్ మేధావిగా ప్రశంసించిన డగ్ ఫోర్డ్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్నారు.

"""/" / కెనడాలోని 10 ప్రావిన్స్‌లు , 3 భూభాగాల నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిల్ ఆఫ్ ది ఫెడరేషన్‌కు ఫోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

వాణిజ్య యుద్ధం గందరగోళానికి దారితీస్తుందని.కర్మాగారాలు మూసివేయబడి , ధరలు పెరుగుతాయని ఆయన అమెరికన్లను హెచ్చరించారు.

ఈ ఏడాది జనవరిలో కెనడా ఈజ్ నాట్ ఫర్ సేల్ అనే టోపీ ధరించి ఫోర్డ్ టీవీలో కనిపించడం సంచలనం కలిగించింది.

ఫోర్డ్ చర్యలపై ట్రంప్ సైతం స్పందించారు.ఆయన ఓ జెంటిల్‌మన్ అన్న ట్రంప్.

కెనడాలో చాలా బలమైన వ్యక్తి ఉన్నాడని , అతను మనదేశంలోకి వచ్చే విద్యుత్‌పై టారిఫ్ వసూలు చేస్తాడని తెలిపారు.