కెనడాలో ఉద్యోగ ఖాళీలు.. స్వల్పంగా తగ్గుదల, కానీ లక్షల్లో అవకాశాలు..!!
TeluguStop.com
కెనడాలో ఉద్యోగ ఖాళీల సంఖ్య నవంబర్ 2022 నాటికి 20,700 తగ్గి.8,50,300కి పడిపోయింది.
ఇది మే 2022లో నమోదైన 1 మిలియన్ కంటే ఎక్కువని స్టాటిస్టిక్స్ కెనడా గురువారం తెలిపింది.
ప్రొఫెషనల్, సైంటిఫిక్, టెక్నికల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, సోషల్ అసిస్టెన్స్ సెక్టార్‌లలో ఖాళీలు ఎక్కువగా వున్నాయని జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది.
ఏజెన్సీ ప్రకారం.నిర్మాణ రంగంలో ఖాళీలు ఎక్కువగా వున్నాయి.
వసతి, ఆహార సేవలు, రిటైల్ వ్యాపారం, తయారీ రంగంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నాయి.
మొత్తం లేబర్ డిమాండ్, ఖాళీ స్థానాల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగ ఖాళీల రేటు నవంబర్ 2022లో 4.
8 శాతంగా వుంది.ఇది జూన్ 2021 తర్వాత అత్యల్ప రేటు అని ఏజెన్సీ తెలిపింది.
నవంబర్ 2022లో ప్రతి ఉద్యోగ ఖాళీకి 1.2 మంది నిరుద్యోగులు ఉన్నారు.
ఆగస్టు నుంచి ఈ విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.కానీ జూన్‌లో కనిష్టంగా 1.
0 నుంచి కొద్దిగా పెరిగింది.కోవిడ్ 19కి ముందు.
ఖాళీల నిష్పత్తి విషయానికి వస్తే 2019 జనవరి నుంచి ఫిబ్రవరి 2020 వరకు దాదాపు 2.
2గా వుందని స్టాటిస్టిక్స్ కెనడా తెలిపింది. """/" /
ఇదిలావుండగా.
ఓపెన్ వర్క్ పర్మిట్ వున్న వారి జీవిత భాగస్వాములకు గతేడాది డిసెంబర్‌లో కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఈ తరహా పర్మిట్ వున్న వారి జీవిత భాగస్వాములు 2023 నుంచి దేశంలో వర్క్ పర్మిట్ పొందడానికి అర్హులని ప్రకటించింది.
ఈ నిర్ణయం వల్ల కెనడాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులకు మేలు కలగనుంది.
ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది విదేశీ పౌరులు కెనడాలోని ఏదైనా యజమాని / ఏదైనా ఉద్యోగంలో చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతిస్తుంది.
"""/" /
దీనిపై కెనడా ఇమ్మిగ్రేషన్, శరణార్ధులు, పౌరసత్వ శాఖ మంత్రి సీన్ ఫ్రేజర్ మాట్లాడుతూ.
తాము ఈరోజు చేసిన ప్రకటన యజమానులకు కార్మికులను కనుగొనడానికి, కుటుంబాలతో కలిసి వుండటానికి దోహదపడుతుందన్నారు.
దాదాపు 2,00,000 మంది వలసదారులకు తమ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఫ్రేజర్ తెలిపారు.
కొత్త పాలసీ ద్వారా 1,00,000కు పైగా జీవిత భాగస్వాములను కెనడా లేబర్ ఫోర్స్‌లోని వివిధ ఖాళీల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆ దేశ అధికారిక గణాంకాల ప్రకారం.గతేడాది మూడవ త్రైమాసికంలో 9,12,600 ఉద్యోగాలు ఖాళీగా వున్నాయట.
కరోనా కారణంగానే కెనడాలో ఈ పరిస్ధితి ఎదురైనట్లుగా తెలుస్తోంది.హెల్త్ కేర్, కన్‌స్ట్రక్షన్, అకామిడేషన్ అండ్ ఫుడ్, రిటేల్ ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఖాళీలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధి కోసం కెనడా ప్రభుత్వం భారీ స్థాయిలో ఇమ్మిగ్రేషన్ విధానాలను సడలిస్తూ వస్తోంది.
దీనిలో భాగంగా ఇప్పటికే దేశంలో స్థిరపడిన విదేశీయులకు కెనడా పౌరసత్వం ఇవ్వాలని జస్టిన్ ట్రూడో సర్కార్ నిర్ణయించింది.
పరిస్థితి చేయిదాటుతోంది .. జగన్ అలా చేయాల్సిందేనా ?