కెనడా : సిక్కు వేర్పాటువాద సంస్థ ఎస్ఎఫ్‌జే దూకుడు.. ఖలిస్తాన్‌పై మరో రెఫరెండానికి పిలుపు
TeluguStop.com
కెనడా కేంద్రంగా ఖలిస్తాన్( Khalistan ) ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న సిక్కు వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’( Six For Justice ) (ఎస్ఎఫ్‌జే) మరో రెఫరెండానికి పిలుపునిచ్చింది.
బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలో అక్టోబర్ 29న రెఫరెండం జరుగుతుందని ప్రకటించింది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ), కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్ పొయిలీవ్రే ( Pierre Poilievre )ఖలిస్తాన్ మద్ధతుదారులపై కీలక నిర్ణయం తీసుకున్న రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలలో ఖలిస్తాన్ కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న సిక్కుల హక్కులను సమర్ధిస్తూ జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు చేశారని ఎస్ఎఫ్‌జే న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్ పన్నూ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 10న జీ20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ).
కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదం, భారత వ్యతిరేక కార్యకలాపాలపై ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు.మోడీతో భేటీ తర్వాత ఢిల్లీలో ట్రూడో మీడియాతో మాట్లాడుతూ.
ఇండో కెనడియన్లు మనదేశంలో (కెనడా)లో భారీ సంఖ్యలో వున్నారని చెప్పారు.ఆ వెంటనే కెనడా కన్జర్వేటివ్ నేత పొయిలీవ్రే.
సర్రేలోని పంజాబీ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను ఐక్య కెనడాను విశ్వసించినట్లే ఐక్య భారతదేశాన్ని కూడా విశ్వసిస్తానని పేర్కొన్నారు.
కానీ ప్రజలు విభేదించే స్వేచ్ఛ కూడా వుందని నమ్ముతున్నానని పొయిలీవ్రే పేర్కొన్నారు.మీరు (ఇండో కెనడియన్లు) ఏ అభిప్రాయాన్ని అయినా వ్యక్తం చేయవచ్చని.
తాను అంగీకరించని అభిప్రాయాలను కూడా వ్యక్తపరచవచ్చని ఆయన చెప్పారు.కానీ వాటిని శాంతియుతంగా వ్యక్తీకరించాలన్నారు.
"""/" /
ఇకపోతే.ఆదివారం బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గురునానక్ గురుద్వారా ఆవరణలో ఖలిస్తాన్‌పై రెఫరెండం జరిగింది.
ఇదే ప్రాంతంలో ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను( Hardeep Singh Nijjar ) గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
నిషేధిత ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) ఈ ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది.
ఈ కార్యక్రమానికి 1,00,000 మందికి పైగా సిక్కులు హాజరయ్యారని గ్లోబల్ న్యూస్ ఛానెల్ నివేదించింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌జే నేత జతీందర్ గ్రేవాల్ మాట్లాడుతూ.ఖలిస్తాన్ సమస్య చాలా మంది సిక్కుల హృదయాలను, మనస్సులను తాకే లోతైన సమస్య అన్నారు.
"""/" /
నిజానికి బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే పట్టణంలో వున్న ‘‘తమనావిస్ సెకండరీ స్కూల్‌లో’’ ఖలిస్తాన్ రెఫరెండం జరగాల్సి వుంది.
ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ అతికించిన పోస్టర్లపై ఆయుధాలు, తుపాకులు వున్నట్లు స్థానికులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన యాజమాన్యం .ఆ పోస్టర్‌లను తొలగించాల్సిందిగా పలుమార్లు రెఫరెండం నిర్వాహకులను కోరింది.
అయినా అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెఫరెండంను రద్దు చేస్తున్నట్లు సర్రే స్కూల్ డిస్ట్రిక్ట్ ప్రకటించింది.
దీంతో వేదికను మరోచోటికి మార్చాల్సి వచ్చింది.