ఓటు బ్యాంక్ రాజకీయాలే ఏజెండా .. అందుకే ఖలిస్తాన్‌‌ వేర్పాటువాదంపై అలా : కెనడాపై జైశంకర్ ఆగ్రహం

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదంపై కెనడా ప్రభుత్వం( Canada ) అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్.

ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కెనడా ఈ సమస్యపై స్పందించడం లేదని.కానీ జాతీయ భద్రత, దేశ సమగ్రతకు భంగం కలిగితే మాత్రం భారత్ తీవ్రంగా స్పందించాల్సి వుంటుందని జైశంకర్( Jaishankar ) హెచ్చరించారు.

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.ఖలిస్తాన్ వేర్పాటువాదం గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య బంధందాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని జైశంకర్ పేర్కొన్నారు.

ఖలిస్తాన్ సమస్యపై కెనడా ఎలా వ్యవహరిస్తుందనే దానిపై తమకు చాలా కాలంగా ఆందోళనగా వుందన్నారు.

వారి వైఖరి ఓటు బ్యాంక్ రాజకీయాలను తేటతెల్లం చేస్తోందని జైశంకర్ చురకలంటించారు. """/" / ఇదే సమావేశంలో పాకిస్తాన్‌పై ( Pakistan )భారత్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి స్పందిస్తూ.

సీమాంతర ఉగ్రవాద విధానాన్ని రద్దు చేసేంత వరకు పాక్‌తో భారత్‌కు ఎలాంటి సాధారణ సంబంధాలు వుండవని స్పష్టం చేశారు.

ఒక సభ్య దేశం ఉగ్రవాదంపై తన విధానాన్ని మార్చుకునే వరకు సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ ) పనిచేయదని జైశంకర్ వ్యాఖ్యానించారు.

రాత్రి పూట ఉగ్రవాదాన్ని, చీకటి పడ్డాక వ్యాపారం చేయడం సాధ్యం కాదని విదేశంగ శాఖ మంత్రి అభివర్ణించారు.

"""/" / ఇదిలావుండగా.ఈ నెల ప్రారంభంలో కెనడాలో జరిగిన ఓ పరేడ్‌లో భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకి( Indira Gandhi ) ఘోర అవమానం జరిగింది.

సిక్కు అల్లర్ల నేపథ్యంలో 1984లో ఆమెను సొంత అంగరక్షకులే కాల్చి చంపారు.ఈ హత్య జరిగిన తీరును గుర్తుచేసేలా ఆ పరేడ్‌లో బొమ్మలతో రీక్రియేట్ చేశారు.

అంతేకాదు.ఈ ఘటనను ఒక సంబరంగా జరుపుకున్నారు.

దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.ఇలాంటి వేర్పాటువాదులకు ఆశ్రయం ఇవ్వడం సరికాదని జైశంకర్ కెనడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇలాంటి ఘటనలు భారత్-కెనడా బంధంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని తేల్చిచెప్పారు.ఈ ఘటన వెనుక భారీ కుట్ర కనిపిస్తోందని.

ఇది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయమేనని జైశంకర్ దుయ్యబట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025