భారతీయులకు కెనడా శుభవార్త.. ఇక ప్రయాణానికి ముందు కరోనా టెస్ట్ అక్కర్లేదు... !!

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మనదేశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌తో మొదలైన ఈ ట్రావెల్ బ్యాన్ పలు దేశాలు ఇంకా కొనసాగిస్తుండటం గమనార్హం.

అయితే మనదేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఒక్కొక్క దేశం నిషేధాన్ని ఎత్తివేస్తూ వస్తున్నాయి.

అమెరికా, బ్రిటన్, యూఏఈలు నిషేధాన్ని ఎత్తివేసిన జాబితాలో వున్నాయి.దీంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తాజాగా కెనడా ప్రభుత్వం భారతీయుల రాకపై ఆంక్షలను సడలించింది.తాజా నోటిఫికేషన్ ప్రకారం.

భారత్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్‌లు, వన్ స్టాప్ ఫ్లైట్‌లో ప్రయాణించేవారు ఇకపై 18 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని కెనడా తెలిపింది.

ఢిల్లీ విమానాశ్రయంలో కెనడా ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్ నుంచి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది.

గతేడాది సెప్టెంబర్ నుంచి భారత్ విషయంలో అమలులో వున్న నిబంధనలు సడలిస్తూ కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియా ప్రశంసించింది.

ఒట్టావాలోని భారత హైకమీషనర్ అజయ్ బిసారియా కెనడా నిర్ణయాన్ని స్వాగతించారు.భారత్‌లో డెల్టా వేరియంట్ వెలుగులోకి వచ్చిన గతేడాది ఏప్రిల్ నుంచి అన్ని డైరెక్ట్ విమానాలపై కెనడా నిషేధం విధించింది.

ఈ క్రమంలో విమాన ప్రయాణాలను తిరిగి సాధారణ స్థితిలోకి తెచ్చేందుకు కెనడా ప్రభుత్వంతో భారత హైకమీషన్ సంప్రదింపులు జరుపుతోంది.

"""/"/ కెనడా విధించిన నిషేధం గతేడాది సెప్టెంబర్ 21తో ముగిసింది.అప్పటికి మనదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, నిషేధం ఎత్తివేస్తూనే కెనడా ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది.అప్పటి గైడ్‌లైన్స్ ప్రకారం.

భారతీయ ప్రయాణికులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కెనడా ఆమోదించిన జెన్‌స్ట్రింగ్‌ ల్యాబ్‌ నుంచి కొవిడ్‌ టెస్ట్‌ (మాలిక్యులర్‌) చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇందులో నెగెటివ్‌ వస్తేనే ప్రయాణానికి అనుమతి ఇస్తారు.కెనడా ప్రయాణానికి 18 గంటల ముందు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కాకుండా భారత్‌లోని ఇతర ల్యాబ్‌ల్లో తీసుకున్న కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోమని కూడా కెనడా ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఇప్పుడు తాజాగా ఈ ఆంక్షలను సడలించడంతో ఎప్పటి నుంచో కెనడా వెళ్లాలని భావిస్తున్న భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొండాపూర్‎లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల విక్రయ ముఠా అరెస్ట్..!