భారత్‌లో దౌత్య సిబ్బందిని మరింత తగ్గించిన కెనడా.. ఏం జరుగుతోంది..?

ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.

కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.ఆ తర్వాత పౌర సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీసా ప్రాసెసింగ్‌ను పునరుద్ధరించింది.

ప్రస్తుతం ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.ఇదిలావుండగా భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్న దౌత్య సిబ్బందిని కెనడా మరింతగా తగ్గించింది.

ఈ విషయాన్ని కెనడా హైకమీషన్( Canada High Commission ) కార్యాలయ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.

పదుల సంఖ్యలో ఉద్యోగులను భారత్‌ నుంచి ఉపసంహరించుకున్నట్లుగా ఆయన తెలిపారు.గతేడాది ట్రూడో ప్రకటన తర్వాత భారత్‌లోని తన దౌత్యవేత్తలను 62 నుంచి 21కి తగ్గించింది కెనడా.

దీంతో వీసా జారీ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతోంది.అంతర్జాతీయ విద్యార్ధులు, భారత్ నుంచి కెనడా వెళ్లాల్సిన వారిపై ఇది ప్రభావం చూపుతోంది.

"""/" / 41 మంది దౌత్యవేత్తల నిష్క్రమణపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ( Melanie Joly ) అప్పట్లో ప్రకటించారు.

ఐదుగురు ఐఆర్‌సీసీ సిబ్బంది భారత్‌లోనే వుంటారని.అత్యవసర ప్రాసెసింగ్, వీసా ప్రింటింగ్, రిస్క్ అసెస్‌మెంట్, వీసా దరఖాస్తు కేంద్రాలు, ప్యానెల్ ఫిజిషియన్‌లు, ఇమ్మిగ్రేషన్ వైద్య పరీక్షలు నిర్వహించే క్లినిక్‌లతో సహా కీలక భాగస్వాములను పర్యవేక్షించడం వంటి విధులు వీరు నిర్వర్తిస్తారని జోలీ తెలిపారు.

"""/" / ఇకపోతే.హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య విషయాన్ని మరోసారి కదిపారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.

కెనడియన్లందరి హక్కులు, స్వేచ్ఛలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు.బుధవారం కెనడా ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న ఉన్నత స్థాయి బహిరంగ విచారణలో సాక్ష్యం ఇచ్చారు ట్రూడో.

తమకు ముందున్న ప్రభుత్వం.న్యూఢిల్లీతో హాయిగా వుందని ఆరోపించారు.

స్థానిక మీడియా షేర్ చేస్తున్న లైవ్ స్ట్రీమింగ్ వీడియోల ప్రకారం.2019, 2021 ఎన్నికల సమయంలో విదేశీ జోక్యంపై నిఘా సమాచారం అందిన తర్వాత తమ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించగా ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య సినిమాలో నటించబోతున్న స్టార్ హీరోయిన్…