కెనడాలో పరిమితికి మించి తాత్కాలిక వలసదారులు : అంగీకరించిన ప్రధాని జస్టిన్ ట్రూడో
TeluguStop.com
వలసదారుల సంఖ్య పెరుగుతూ వుండటంతో కెనడా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా కెనడియన్లు( Canadians ) సైతం ఇమ్మిగ్రేషన్ పాలసీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
తాజాగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) స్పందించారు.
కెనడాకు తాత్కాలిక వలసదారుల పెరుగుదల పరిమితికి మించే వుందని అంగీకరించారు.తమ ప్రభుత్వం ఈ సంఖ్యను తగ్గించాలని కోరుకుంటోందని ట్రూడో తెలిపారు.
నోవా స్కోటియాలోని డార్ట్‌మౌత్‌లోని ( Dartmouth, Nova Scotia )ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా.తాత్కాలిక విదేశీ ఉద్యోగులు లేదా అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్యలో పెరుగుదలను చూశామన్నారు.
"""/" /
2017లో మొత్తం జనాభాలో తాత్కాలిక వలసదారులు కేవలం 2 శాతం మంది మాత్రమేనని .
కానీ ఇప్పుడు అది 7.5 శాతానికి పెరిగిందని ట్రూడో పేర్కొన్నారు.
ఈ పరిస్ధితులు తిరిగి మన నియంత్రణలోకి రావాల్సిన అవసరం వుందని ప్రధాని స్పష్టం చేశారు.
ఇమ్మిగ్రేషన్ సంఖ్య పెరగడంతో కెనడాలో గృహ సంక్షోభం ఏర్పడిందని .అదే సమయంలో మౌలిక సదుపాయాలపైనా ప్రభావం చూపిందని ట్రూడో అన్నారు.
2015లో ట్రూడో తొలిసారి ప్రధానిగా పగ్గాలు అందుకున్న సమయంలో కెనడాలో అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్య 2,19,035 మంది వీరిలో స్టడీ పర్మిట్‌లు కలిగిన భారతీయులు 31,920 మంది.
2023లో 6,84,385 స్టడీ పర్మిట్‌లు జారీ చేయగా.వారిలో 2,78,860 మంది భారతీయులేనని గణాంకాలు చెబుతున్నాయి.
"""/" /
అదే విధంగా తాత్కాలిక విదేశీ ఉద్యోగుల కోసం ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) నుంచి వచ్చిన డేటా ప్రకారం.
2015లో తాత్కాలిక ఉద్యోగులు 1955 మంది ఉంటే.వీరిలో 155 మంది భారతీయులే.
2023లో ఆ సంఖ్యలు వరుసగా 1,67,650 .24,330కి పెరిగాయి.
వ్యవస్థలపై ఒత్తిడి పెరగడంతో ట్రూడో ప్రభుత్వం ఈ సంఖ్యలను తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టింది.
మార్చి 21న ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.కెనడాలో తాత్కాలిక నివాసితుల జనాభాను వచ్చే మూడేళ్లలో 5 శాతానికి తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్13, శుక్రవారం 2024