విదేశీ విద్యార్ధుల పనిగంటలపై ఆంక్షల దిశగా కెనడా..?

మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సంస్కరణలు తీసుకొస్తోంది కెనడా.మెరుగైన జీవన ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మంచి ఉద్యోగావకాశాలు వుండటంతో పలు దేశాల విద్యార్ధులు కెనడాకు క్యూ కడుతున్నారు.

అలాగే సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా జారీ, త్వరగా శాశ్వత నివాస హోదా వంటి అనుకూల అంశాలు కెనడా వైపు విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి.

కోవిడ్ తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు తీసుకురావడంతో కెనడాకు వలసలు పెరుగుతున్నాయి.అయితే ప్రస్తుతం గృహ సంక్షోభం, జీవన వ్యయాల పెరుగుదల కారణంగా కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్ధుల రాకపై కొన్ని పరిమితులు విధిస్తోంది.

తాజాగా అంతర్జాతీయ విద్యార్ధుల( International Students ) పనిగంటలపై ఆంక్షలు విధించే దిశగా జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

దీనిలో భాగంగా ఒక విదేశీ విద్యార్ధి క్యాంపస్ వెలుపల పనిచేసే గంటల సంఖ్యను వారానికి 24కి పరిమితం చేయాలని యోచిస్తోంది.

అంతర్జాతీయ విద్యార్ధులు ప్రతివారం 20 గంటలకు పైగా పనిచేయడానికి అనుమతించే తాత్కాలిక విధానం మంగళవారంతో ముగుస్తున్నందున సోమవారం ఒట్టావాలో ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ఈ ప్రకటన చేశారు.

కెనడాకు( Canada ) వచ్చే విద్యార్ధులు చదువుకోవడానికి ఇక్కడే వుండాలని.విద్యార్ధులు వారానికి 24 గంటల వరకే పనిచేయడానికి అనుమతిస్తే వారు తమ చదువులపై దృష్టి సారిస్తారని మిల్లర్ అన్నారు.

"""/" / కరోనా కాలంలో ప్రవేశపెట్టిన మునుపటి విధానం ప్రకారం .విదేశీ విద్యార్ధి వారానికి 40 గంటల పాటు పనిచేయడానికి అనుమతించబడతాడు.

అలాంటి విద్యార్ధులు వేసవి సెలవుల్లో ఎన్ని గంటల పాటైనా పనిచేసుకోవచ్చు.పబ్లిక్ కౌంటర్ పార్ట్‌తో లైసెన్సింగ్ ఏర్పాటు ద్వారా ప్రైవేట్ సంస్థలో కళాశాల ప్రోగ్రామ్‌ను ప్రారంభించే అంతర్జాతీయ విద్యార్ధులు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్‌కు అర్హులు కాదని ఐఆర్‌సీసీ ప్రకటించింది.

ఈ ఏడాది మే 15 లేదా ఆ తర్వాత అడ్మిగ్ అయిన వారికి ఈ పరిమితి వర్తిస్తుంది.

"""/" / కెనడాలో స్టడీ పర్మిట్‌లు కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతున్నాయని విమర్శలు వున్నాయి.

వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కొత్త చర్యలను తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.అయితే సర్కార్ నిర్ణయం భారతీయ విద్యార్ధులపై ప్రభావం చూపే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు.

కెనడాలో జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోన్న విద్యార్ధులకు పనిగంటలను తగ్గించడం వల్ల కొత్త సమస్యలు ఎదురవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!