అనుకున్నదే అయ్యింది : ఇండియా – కెనడాల మధ్య ‘‘ఖలిస్తాన్’’ చిచ్చు , వాణిజ్య చర్చలకు బ్రేక్

అనుకున్నదే అయ్యింది.ఇండియా-కెనడాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాదం( Khalistan ) చిచ్చు పెడుతుందన్న నిపుణుల మాట అక్షరాలా నిజమైంది.

ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడింది.

ఇరుదేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను ప్రారంభిస్తామని ఇండియా( India ) తేల్చి చెప్పింది.

ఇది తాత్కాలికం మాత్రమేనని.సమస్యలు పరిష్కారమైన తర్వాత చర్చలను మళ్లీ ప్రారంభిస్తామని ఓ భారత అధికారి తెలిపారు.

కెనడాలో( Canada ) చోటు చేసుకుంటున్న కొన్ని రాజకీయ పరిణామాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆయన వెల్లడించారు.

ఇప్పటికే ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈటీపీఏ) కోసం జరుగుతున్న చర్చలకు విరామం ఇస్తున్నట్లుగా కెనడియన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది.

ఒట్టావాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ) స్పందిస్తూ.

కెనడియన్ ప్రభుత్వం వైపు నుంచి ఈ అగ్రిమెంట్‌పై చర్చలకు విరామం వచ్చిందన్నారు.విరామం ఎత్తివేసే వరకు తాము వేచి వుంటామని సంజయ్ కుమార్ చెప్పారు.

ఇదే సమయంలో విరామం ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో కెనడా ఎలాంటి కారణం చూపలేదు.

అయితే ఇది తాత్కాలికమేనని భారత ప్రభుత్వ వర్గాలు భావించాయి.కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో( Piyush Goyal ) కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ( Mary Ng ) మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగకపోవడంతో.

ఈ ఏడాది ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడం లేదు. """/" / అయితే భారత్ తరపున నుంచి చర్చలు నిలిపివేయడానికి ఖలిస్తాన్ వేర్పాటువాదమే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం కెనడా కేంద్రంగా కొన్ని వేర్పాటువాద గ్రూపులు ఏళ్లుగా పోరాడుతున్నాయి.

ప్రపంచం మొత్తంలో ఈ ముఠాకి కెనడా సేఫ్ ప్లేస్‌గా మారింది.ప్రధానంగా కెనడాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన కొందరు పంజాబీ సంతతి వ్యక్తులు( Punjabis ) ఖలిస్తాన్ ఉద్యమానికి మద్ధతుగా నిలుస్తున్నారు.

ఎస్ఎఫ్‌జే, బీకేఐ, కేటీఎఫ్, కేజడ్ఎఫ్ వంటి ఖలిస్తానీ సంస్థలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఎన్ఐఏ నివేదిక చెబుతోంది.

"""/" / ఇక ఇటీవలికాలంలో కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి.ఖలిస్తాన్ కోసం ఆందోళనలు, ర్యాలీలు, రెఫరెండంలు నిర్వహించడంతో పాటు హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం వాటిపై భారత వ్యతిరేక రాతలు రాయడం చేస్తున్నారు.

దీనిపై జస్టిన్ ట్రూడోకు( Justin Trudeau ) ఎన్నిసార్లు చెప్పినా.అటు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో భారత్ ఇప్పుడు తీవ్ర చర్యలకు దిగింతది.

దీనిలో భాగంగానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!