హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు .. ఆ నలుగురు భారతీయులకు బిగ్ రిలీఫ్

కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసు నేటికీ దుమారం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన నలుగురు భారతీయులకు ఊరట లభించింది.

వీరికి బెయిల్ మంజూరు చేస్తూ కెనడా కోర్టు( Canada Court ) ఆదేశాలు జారీ చేసింది.

2023 జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్‌‌ దారుణహత్యకు గురయ్యాడు.

గురునానక్ సింగ్ గురుద్వారా సాహిబ్ పార్కింగ్ ప్లేస్‌లో అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఈ ఘటన భారత్ - కెనడాలలో తీవ్ర దుమారం రేపగా.ఖలిస్తాన్( Khalistan ) మద్ధతుదారులు భగ్గుమన్నారు.

"""/" / ఆ తర్వాత కొద్దిరోజులకు నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా .

కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసి తర్వాత పునరుద్ధరించింది.అయితే గతేడాది నిజ్జర్ హత్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో( Canada Parliament ) ఆయనకు నివాళులర్పించడం, స్వయంగా ఎంపీలు లేచి నిలబడి మౌనం పాటించడం ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు తెచ్చిపెట్టింది.

భారత ప్రభుత్వం ఒక ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి ట్రూడో సర్కార్ ఈ స్థాయిలో గౌరవం ఎందుకు కల్పిస్తోందని విపక్షనేతలు భగ్గుమన్నారు.

"""/" / ఆ తర్వాత కొద్దిరోజులు సైలెంట్ అయిన ట్రూడో.మళ్లీ జోరు పెంచారు.

నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా అనుమానితుల జాబితాలో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చి దుమారం రేపారు.

దీనిపై భగ్గుమన్న న్యూఢిల్లీ .భారత దౌత్యవేత్తలను కెనడా నుంచి ఉపసంహరించింది.

భారత్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో తాను చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవంటూ ట్రూడో చేతులెత్తేశారు.

ఇక నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కరణ్ బ్రార్ (22),( Karan Brar ) కమల్ ప్రీత్ సింగ్ (22),( Kamalpreet Singh ) కరణ్ ప్రీత్ సింగ్ (28),( Karanpreet Singh ) అమన్‌దీప్ సింగ్ (22)లను( Amandeep Singh ) గతేడాది మేలో కెనడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

గత కొద్దిరోజులుగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఈ నలుగురికి దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు విచారణను బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది.

అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.

నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే ఇలా చేయండి..!