అబ్బా.. ఏం వాడకం అయ్యా… కెనడా థియేటర్స్ లో ప్రభాస్ యాడ్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
డార్లింగ్ ప్రభాస్ గురించి ఆయనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మోస్ట్ బిజీ హీరోగా మారిపోయారు ప్రభాస్.
ప్రభాస్( Prabhas ) నటిస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
బాహుబలి సినిమాతో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపుని సంపాదించుకున్నారు.దీంతో ప్రభాస్ సినిమాలకు కూడా మంచి ఆదరణ వస్తుంది.
"""/" /
ఇక ఈ స్టార్‌డమ్ ని ఉపయోగించుకొని కెనడాకి చెందిన ఒక కారు రిపేరింగ్ సంస్థ ప్రమోషన్స్ చేసుకుంటుంది.
కెనడాలోని( Canada ) ఒక థియేటర్ లో సినిమాకి మధ్య కమర్షియల్ యాడ్స్ ప్లే చేస్తున్నారు.
ఈ క్రమంలోనే URBAN AUTO COLLISION అనే కెనడా కారు రిపేరింగ్ సంస్థకి సంబంధించిన యాడ్ ని కూడా ప్లే చేశారు.
ఇక ఈ యాడ్ ని ప్రభాస్ మిర్చి మూవీ( Mirchi Movie ) సీన్ తో డిజైన్ చేసి ప్లే చేశారు.
మిర్చి సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది.ఆ సీన్ లో ప్రభాస్.
కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ పక్కనే ఉన్న కారుని కాలుతో తన్నగా, ఆ కారు టైర్ ఊడిపోతుంది.
"""/" /
ఇక ఈ సీన్ ని చూపిస్తూ.కారు రిపేర్ అవ్వగానే తమని సంప్రదించండి అంటూ అర్బన్ ఆటో కొల్లిసిన్ యాడ్ ని డిజైన్ చేయించుకున్నారు.
ఇక ఈ యాడ్ ని థియేటర్ లో చూసిన తెలుగు ఆడియన్స్ షాక్ అయ్యి దానిని వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజెన్స్.
మిర్చి మూవీలో బ్రహ్మానందం చెప్పిన.అబ్బా ఏం వాడకం అయ్యా అనే డైలాగ్ ని కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.
అంగన్‌వాడీ ఉద్యోగం కోసం రూ.70 వేలు డిమాండ్ చేసిన అధికారి.. వీడియో వైరల్!