ఖలిస్తానీల వల్ల కెనడా కలుషితం అవుతోంది : భారత సంతతి ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కెనడాలో ఖలిస్తానీ ( Khalistani In Canada )వేర్పాటువాదుల ఆగడాలపై మరోసారి స్పందించారు భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య( MP Chandra Arya ).

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత , సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌.

( Gurupatwant Singh Pannoon ).తనతో సహా హిందూ స్నేహితులను భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్న వీడియోపై చంద్ర ఆర్య బుధవారం స్పందించారు.

కెనడా తమ దేశమని, అది ఖలిస్తానీ తీవ్రవాదులతో కలుషితమవుతోందని దుయ్యబట్టారు.ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు కెనడాకు వచ్చి దేశ సామాజిక , ఆర్ధిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారని చంద్ర ఆర్య గుర్తుచేశారు.

"""/" / తాము కెనడా సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి అపారమైన సానుకూల , ఉత్పాదక సహకారాలను అందించామని ఆయన వెల్లడించారు.

కెనడియన్ చార్టర్ ఆఫ్ రైట్స్ ( Canadian Charter Of Rights )హామీ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదులు తమ భూమిని కలుషితం చేస్తున్నారని చంద్ర ఆర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూ కెనడియన్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత, హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు.

రెండ్రోజుల క్రితం ఎడ్మంటన్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక రాతలు రాశారు.

ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ), భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్యలను ఉద్దేశించి అవి ఉన్నాయి.

"""/" / కాగా.గతేడాది ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసినట్లుగా ఖలిస్తాన్ వాదులు ప్రదర్శించిన ఘటన కలకలం రేపింది.

దీనిపై చంద్ర ఆర్య ఘాటుగా స్పందించారు.మా పెరట్లో (కెనడా) పామలు తలెత్తి బుసలు కొడుతున్నాయని కెనడాలో ఖలిస్తాన్ మద్ధతుదారులు పెరుగుతున్నారని, ఎప్పుడైనా వీరు కాటు వేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

కెనడాలోని ఖలిస్థానీలు హక్కుల చార్టర్‌ను దుర్వినియోగం చేయడంలో కొత్త స్థాయికి చేరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్ప సినిమాని రిజెక్ట్ చేసిన ఆరుగురు యాక్టర్లు.. ఎవరంటే..?