ప్రార్ధనా స్థలాల వద్ద కాన్సులర్ క్యాంప్‌లు వద్దు : భారత్‌కు కెనడా అడ్వైజరీ
TeluguStop.com
ఖలిస్తాన్ వేర్పాటువాదుల కారణంగా కెనడాలో( Canada ) రోజురోజుకు పరిస్ధితులు దిగజారుతున్నాయి.తన రాజకీయ లబ్ధి కోసం అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) ఈ ముఠాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వాళ్లు రెచ్చిపోతున్నారు.
రెండ్రోజుల క్రితం బ్రాంప్టన్‌లోని హిందూ సభపై ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) దాడి చేయడం కలకలం రేపింది.
ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో భద్రతా కారణాల రీత్యా కెనడాలోని భారతీయ మిషన్‌లు నిర్వహించాలనుకున్న కాన్సులర్ క్యాంప్‌లను కూడా భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
"""/" /
తాజాగా కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అయిన పీల్ రీజినల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్ప.
( Nishan Duraiappah ) టొరంటోలోని భారత కాన్సులేట్‌కు( Indian Consulate ) ఓ లేఖ రాశారు.
ప్రార్థనా స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద క్యాంప్‌లు నిర్వహిస్తే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
బ్రాంప్టన్‌లోని హిందూ మందిర్‌పై ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడి చేసిన తర్వాత ఈ లేఖ పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ దాడికి నిరసనగా ఇండో కెనడియన్ గ్రూపులు ఆలయం వెలుపల ర్యాలీ నిర్వహించారు.
ఈ నిరసన ప్రదర్శనలో మారణాయుధాలు కూడా కనిపించినట్లుగా నిషాన్ పేర్కొన్నారు. """/" /
ఈ నేపథ్యంలో టొరంటోలోని భారత కాన్సులేట్ .
ముందుగా షెడ్యూల్ చేసిన కొన్ని కాన్సులర్ క్యాంప్‌లను( Consular Camps ) రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.
కమ్యూనిటీ క్యాంప్‌ల నిర్వాహకులకు కనీస భద్రత కల్పించడంలో కెనడియన్ ఏజెన్సీలు తమ అసమర్ధతను తెలియజేసిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాన్సులేట్ తెలిపింది.
వచ్చే వారాంతంలో అల్బెర్టాలోని ఎడ్మంటన్ సహా పలు ప్రాంతాల్లో కాన్సులర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాయి.
అయితే ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు ఇప్పటికే వేదికల వద్ద నిరసనలకు పిలుపునిచ్చాయి.కాగా.
కెనడాలో స్ధిరపడిన పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు వంటి సేవలను అందించడానికి ప్రతియేటా కాన్సులర్ క్యాంప్‌లు నిర్వహిస్తారు.
పెన్షన్ ప్రయోజనాల కోసం సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేస్తారు.ఒట్టావాలోని భారత హైకమీషన్‌తో పాటు టొరంటో, వాంకోవర్‌లలోని భారతీయ కాన్సులేట్‌లు, అంటారియో, క్యూబెక్, మానిటోబా, సస్కట్చేవాన్, అల్బెర్టా, నోవాస్కోటియా ప్రావిన్సులలో ఇందుకోసం వేదికలను సిద్ధం చేసింది భారత విదేశాంగ శాఖ.
వీటిలో గురుద్వారాలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి.
మ్యాట్రిమోని మోసాలపై హెచ్చరిక చేసిన సజ్జనార్