గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం మనకు ఎన్నో పురాణాలు ఉన్నాయి.అందులో గరుడ పురాణం ఒకటి.

అయితే చాలామంది గరుడపురాణం పట్ల పూర్తిగా వ్యతిరేక భావనలు కలిగి ఉంటారు.గరుడ పురాణం చదవటం వల్ల అనేక కష్టాలు వస్తాయని, ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలని భావిస్తుంటారు.

గరుడ పురాణం కేవలం మనుషులకు విధించే శిక్షలను తెలియజేస్తుందని,మనుషులు చేసిన పాపాలకు మరణాంతరం ఎలాంటి బాధలను అనుభవించాలనే విషయాల గురించి ఉంటుందని అందుకోసమే ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని చాలా మంది చెబుతుంటారు.

అదేవిధంగా నాగ దేవతలను పూజించే వారు గరుడ పురాణాన్ని చదవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతారు.

అయితే నిజంగానే గరుడపురాణం చదవటం వల్ల ఈ విధమైన ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారా.

నిజంగానే గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకోకూడదన్న సందేహాలు చాలా మందిలో కలుగుతుంటాయి.

మరి గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

"""/"/ అన్ని పురాణాలు మాదిరిగానే గరుడ పురాణం ఒకటి.అయితే మనుషులకు విధించే శిక్షలు ఇందులో ఉంటాయి కనుక దీనిని ఇంట్లో పెట్టకూడదని భావిస్తారు.

నిజానికి ఈ పుస్తకాన్ని ఎలాంటి అనుమానాలు లేకుండా నిస్సంకోచంగా ఇంటిలో ఉంచుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

ఎందుకంటే గరుడ పురాణం అనేది కేవలం శిక్షలను మాత్రమే తెలియజేస్తుంది కానీ ఆ పుస్తకం ఒక దుష్టశక్తుల నిలయం కాదు.

మనకు కావాల్సిన ఎంతో విలువైన సమాచారాన్ని ఈ గరుడ పురాణం అందిస్తుంది.మనం పాపాలు చేయటం వల్ల ఎలాంటి శిక్షలు పడతాయో ముందుగా తెలియజేస్తూ మనలను అప్రమత్తం చేస్తుంది.

ఇలాంటి విలువైన పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జ్ఞానం కలుగుతుంది తప్ప ఎలాంటి కీడు జరగదని ఈ పుస్తకాన్ని నిస్సంకోచంగా ఇంట్లో పెట్టుకోవచ్చని చెప్పవచ్చు.

తల్లి పాత్రలో నటించిన శృతి మరాఠే వయస్సు ఎన్టీఆర్ కంటే తక్కువా.. ఏజ్ గ్యాప్ ఎంటే?