డిన్నర్ తర్వాత నడక మంచిదా? కాదా?.. తప్పక తెలుసుకోండి!
TeluguStop.com
డిన్నర్ చేసిన తర్వాత కొద్ది సమయం పాటు నడవడం మంచిదా.? కాదా.
? అన్న డౌట్ మనలో చాలా మందికి కామన్‌గా ఉంటుంది.రాత్రి భోజనం చేశాక నడవడం మంచిది అని కొందరు అంటే.
మంచిది కాదని కొందరు అంటారు.నిజానికి డిన్నర్ తర్వాత నడవొచ్చు.
కానీ వెంటనే నడవడం కరెక్ట్ కాదు.భోజనం చేసిన పదిహేను నిమిషాల అనంతరం నడకను ప్రారంభించాలి.
పైగా భోజనం చేశాక ఇరవై నుంచి నలభై నిమిషాల పాటు నడవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.
తిన్న తర్వాత నడవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
శరీరం పోషకాలను చురుగ్గా గ్రహిస్తుంది.అలాగే చాలా మంది రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని బాధపడుతుంటారు.
అలాంటి వారు డిన్నర్ తర్వాత కొద్ది సమయం పాటు నడిస్తే శరీరం అలసటకు గురవుతుంది.
దీంతో ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. """/" /
వాకింగ్ వల్ల హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది.
దీని కారణంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.ఒత్తిడి, అలసట వంటివి చిత్తు అవుతాయి.
నైట్ భోజనం చేశాక కొంత మంది మళ్లీ కొద్ది సమయానికి లేదా మిడ్ నైట్ చిరు తిండ్లపై పడుతుంటారు.
ఇలా చేయడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు.కానీ వాకింగ్ వల్ల శరీరం పూర్తిగా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు.
దీంతో మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉండవు.చిరు తిండ్లకు దూరంగా ఉండవచ్చు.
మధుమేహం ఉన్నవారు భోజనం చేసిన కొద్ది సమయం తర్వాత ముప్పై నిమిషాల పాటు నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.
అంతేకాదు తిన్న తర్వాత నడక గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
మరియు వెయిట్ లాస్ కు అద్భుతంగా సహాయపడుతుంది.