రోజులో ఒక లీటర్ కొబ్బరి నీళ్లు త్రాగవచ్చా.. లేదంటే కిడ్నీల పై ఏమైనా చెడు ప్రభావం పడుతుందా..!

సాధారణంగా చాలా మంది వేసవి కాలంలో( Summer ) అతి దాహం కోసం ఆరోగ్యానికి మంచిదను కొబ్బరి నీళ్లు( Coconut Water ) తాగుతూ ఉంటారు.

అయితే ప్రస్తుత సమాజంలో ఇటువంటి బోండాలతో పాటు బాటిళ్లలోనూ కొబ్బరి నీళ్ళను అమ్ముతూ ఉన్నారు.

ఇలా ఒకే సారి లీటర్ కొబ్బరి నీళ్లు తాగవచ్చా.దీని వల్ల కిడ్నీల( Kidneys ) మీద ఏమైనా భారం పడుతుందా.

అసలు రోజులో లేదా వారంలో ఎన్ని కొబ్బరి నీళ్లు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో ద్రవాల స్థాయిని నియంత్రణలో ఉంచేందుకు, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసేందుకు కొబ్బరి నీళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఆలాగే సోడియం, పొటాషియం, మాంగనీసు లాంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. """/" / ముఖ్యంగా చెప్పాలంటే వడదెబ్బకు, డయోరియాకు కొబ్బరి నీళ్లు మంచిది.

అలాగే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి గుండె జబ్బులు, బిపి ఉన్న వాళ్లకు ఇది ఎంతో మంచిది.

ఇందులో ఉండే మీడియం చెయిన్‌ ట్రై గ్లిజరైడ్లు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

అలాగే జీర్ణశక్తి కి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.పొటాషియం( Potassium ) శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది.

కాబట్టి కిడ్నీలకు కూడా మంచిది.అంతే కాకుండా కొబ్బరి నీళ్లలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇది రోగ నిరోధక వ్యవస్థకు( Immunity System ) ఎంతో మేలు చేస్తుంది.

ఇందులో విటమిన్లు మినరళ్లు పోను 95% మంచి నీళ్ళే ఉంటాయి. """/" / అలాగే 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్లు రోజుకు లీటరు కొబ్బరి నీళ్లు తాగవచ్చు.

50 ఏళ్లు పైబడిన వారిలో ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేకపోతే చక్కగా వీటిని తాగవచ్చు.

అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు మాత్రం రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను బట్టి తీసుకోవడం మంచిది.

కాబట్టి ఇలాంటి వారు న్యూట్రిషన్లను సంప్రదించి దానికి తగ్గట్టుగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?