తులసీ దళాలను ఏరోజైనా కోయవచ్చా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఆ మొక్కలకు ప్రతిరోజూ దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేస్తారు.

అలాంటి మొక్కలలో తులసి ఎంతో ప్రధానమైనది.తులసి ఒక దేవతా మొక్కగా భావించి ప్రతి ఇంటి ముందు మనకు దర్శనమిస్తుంది.

ఈ తులసి చెట్టును భక్తితో పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.అంతే కాకుండా తులసీ దళాలను నమలడం ద్వారా సర్వరోగాలు నయమవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న తులసీ దళాలను కొందరు ఎప్పుడు పడితే అప్పుడు కోస్తూ ఉంటారు.

అలా కోయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.తులసీ దళాలను ఆదివారం, శుక్రవారం రోజుల్లో, మన్వాదులు, యుగాదులు, సంక్రాంతి, పూర్ణమి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, రాత్రులలోనూ, సంధ్యాకాల సమయంలో, మధ్యాహ్నానంతర సమయాలలో తులసీ దళాలను కోయకూడదని శాస్త్రం చెబుతోంది.

"""/" / ఇంతటి పవిత్రమైన తులసి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవి కొలువై ఉంటారని భావిస్తారు.

అందుకే ఈ తులసి చెట్టును దేవతా వృక్షంగా భావించి ప్రత్యేకమైన పూజలను చేస్తారు.

ఈ తులసీ దళాలను తరచూ రెండు ఆకులు నమలడం ద్వారా మన శరీరంలో ఏర్పడినటు వంటి దగ్గు, జలుబు వంటి వాటికి మంచి నివారణిగా ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు తులసీ దళాలను, తులసి రసాన్ని వాడుతారు.

తులసీ దళాలు వేసిన నీటిని సేవిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.ఇంతటి పవిత్రమైన తులసి మొక్కకు ప్రతి ఇంటిలో బృందావనం నిర్మించి అందులో తులసిని నాటి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడంవల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.

ఆ రూల్ వెంటనే మార్చండి.. ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి