ఈ టైర్ 2 హీరోలు ఈసారైనా హిట్ కొట్టేనా.. లేకపోతే కెరీర్ కష్టమే!
TeluguStop.com
టాలీవుడ్ లో స్టార్ హీరోలు వరుస హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియన్ హీరోలుగా ప్రేక్షకుల చేత మన్ననలు పొందుతున్నారు.
అయితే టైర్ 2 హీరోలు మాత్రం ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
ఒక్కరికి కూడా సూపర్ హిట్ అనేది దక్కలేదు.2022లో భారీ డిజాస్టర్ లను అందుకోవాల్సి వచ్చింది.
అందుకే ఈ టైర్ 2 హీరోలు ప్రెజెంట్ చేస్తున్న సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
ఈ సినిమాలు హిట్ అయితేనే వీరి కెరీర్ మరింత జోరుగా సాగుతుంది.టైర్ 2 హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నాని(Nani) గురించి.
టైర్ 2 హీరోల్లో ఒకరైన నాచురల్ స్టార్ నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో ప్లాప్ అందుకున్నాడు.
దీంతో ప్రెజెంట్ చేసిన దసరా సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమామార్చి 30న రిలీజ్ కానుంది.
"""/" /
ఇక మరో హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కూడా కెరీర్ లో బ్లాక్ బస్టర్ కోసం చాలా కష్టపడుతున్నాడు.
ప్రెజెంట్ అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''ఏజెంట్'' సినిమా మీదనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు.
ఈ సినిమాతో కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు.అలాగే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని(Ram ) కూడా బోయపాటి వంటి మాస్ డైరెక్టర్ తో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
"""/" /
ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా లవ్ స్టోరీతో మరోసారి మంచి హిట్ కొట్టాలని లైగర్ ప్లాప్ మర్చిపోవాలని అనుకుంటున్నాడు.
అందుకే ఖుషీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక నాగ చైతన్య(Naga Chaitanya) కూడా వరుస ప్లాప్స్ తో డీలా పడిపోయాడు.
ప్రెజెంట్ కస్టడీ అనే ప్రయోగాత్మక సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు.అలాగే వరుణ్ తేజ్, సాయి తేజ్ లు కూడా ప్రయోగాత్మక సినిమాలతో రెడీ అవుతున్నారు.
ఇలా టైర్ 2 హీరోలంతా ఆసక్తికరమైన సినిమాలతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.