సీతాఫలలను ఇష్టపడని వారు.. ఈ ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతారు?

సీతాఫలంలో( Custard Apple ) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలుసు.

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.వీటిని తింటే మీ గుండె ఆరోగ్యాంగా ఉంటుంది.

సీతాఫలాన్ని తినడం వల్ల రోగ నిరోధక శక్తి( Immunity ) కూడా మెరుగుపడుతుంది.

ఇంకా చెప్పాలంటే సీతాఫలాన్ని షుగర్ ఆపిల్ అని కూడా అంటారు.దీన్ని రుచి అద్భుతంగా ఉంటుంది.

ఈ పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి.నిజానికి ఈ పండు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

"""/" / ఈ పండులో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.అసలు ఈ పండు ను తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందగలమో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) సమృద్ధిగా ఉండే సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ ఏ తో పాటుగా ఎన్నో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.అలాగే మీ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.

"""/" / గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్( Cancer ) వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

సీతాఫలాలను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే సీతాఫలంలో డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.అలాగే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

అంతేకాకుండా సీతాఫలంలో సహజమైన ఎంజైమ్లు కూడా ఉంటాయి.ఇవి సంక్లిష్ట ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడతాయి.

మంచి పోషక శోషణ ను సులభతరం చేస్తాయి.మీరు సీతాఫలం తింటే మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే ఎటువంటి జీర్ణ సమస్యలు కూడా రావు.

సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ వివరాలు ఇవే.. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?