ఈ రాశుల వారు నల్ల దారం కట్టుకోవచ్చా..? అయితే ఏమవుతుంది..?

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం కొన్ని పనులు చేయడం వలన చెడు ప్రభావం నుండి తప్పించుకోవచ్చు అని చెబుతూ ఉంటారు.

దీంతో సొంత ఆలోచనలతో కొందరు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు.అయితే ఇవి రివర్స్ గా మారి మంచికి బదులు చెడు కూడా జరగవచ్చు.

ఇతరులతో పోల్చుకొని ఈ పనులు చేయడం వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి.

సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా విస్తరించి ఉంటుంది.దీని నుండి తప్పించుకోవడానికి చేతికి కొన్ని దారాలు కట్టుకుంటూ ఉంటారు.

వీటిలో చాలామంది ఎక్కువగా నల్ల దారం ధరిస్తారు.నల్ల దారం( Black Thread ) చేతికి కట్టుకోవడం వలన చెడు ప్రభావం నుండి తప్పించుకోవచ్చని అందరూ భావిస్తారు.

అయితే ఈ రెండు రాశుల వారు నల్ల దారాన్ని ధరిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఆ రాశులు ఎవరు తెలుసుకుందాం. """/" / నల్ల రంగు శనీశ్వరుడికి( Lord Shaniswara ) చాలా ఇష్టం.

అయితే కొందరు శని ప్రభావం ఉండకుండా నల్లదారం ధరిస్తూ ఉంటారు.అలాగే దిష్టి తగలకుండా ఉండడానికి నల్ల దారం ధరిస్తారు.

మగవాళ్ళు నల్ల దారాన్ని చేతికి కట్టుకుంటారు.ఆడవాళ్లు ఎడమ కాలికి కట్టుకుంటారు.

ఇది కొంచెం ఆకర్షణీయంగా ఉండడంతో చాలామంది వీటిని అందంగా ఉండేందుకు కూడా ధరిస్తూ ఉన్నారు.

కానీ నల్ల దారాన్ని అందరూ కట్టుకోవడం మంచిది కాదు.కొందరు మాత్రమే దీనిని ధరించాలి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి( Scorpio )లో ఉన్నవారు బృహస్పతి అధిపతిగా ఉంటాడు.

బృహస్పతికి ఎరుపు రంగు అంటే ఇష్టం.వృశ్చిక రాశి ఉన్నవారు నల్ల దారం కట్టుకోవడం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.

"""/" / మగవాళ్ళు వీలైతే ఎరుపు దారం కట్టుకోవడం మంచిది.కానీ ఆడవాళ్లు కాళ్లకు మాత్రం నల్ల దారం కట్టుకోకూడదని పండితులు కూడా చెబుతున్నారు.

అలాగే మేషం రాశి వారికి కూడా గురుడు ఆధిపత్యంగా ఉంటారు.ఈ రాశి వారు సైతం నల్లదారాన్ని ధరించకూడదు.

వీరు నల్లదారాన్ని ధరిస్తే అన్ని కష్టాలు ఎదురవుతాయి.ఈ రెండు రాశుల వారు కూడా నల్ల దారాన్ని ధరించకూడదు.

మిగతావారు నల్ల దారాన్ని ధరించవచ్చు.ఇక కొత్తగా నల్ల దారాన్ని శనివారం రోజున కట్టుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

అలాగే నరదృష్టి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.అలాగే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలవచ్చు.

నల్ల దారాన్ని కట్టుకున్న వాళ్ళు నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు.కానీ కొన్ని రోజుల కొకసారి ఆ నల్ల దారాన్ని మారుస్తూ ఉంటే ప్రయోజనాలు ఉంటాయి.

కార్తీకదీపం నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ కాల్ చేసి అలా చేశారా?