అమ్మ వారి శేష వస్త్రాలు ధరించవచ్చా.. ధరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.శక్తిపీఠాలుగా, ఆదిపరాశక్తిగా కొలువైన అమ్మవారు భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ వారికి కొంగుబంగారం చేస్తుంటారు.

అయితే అమ్మవారికి భక్తులు ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.ముఖ్యంగా మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీరను ఇచ్చి పూజలు చేస్తుంటారు.

ఈ విధంగా అమ్మవారికి సమర్పించిన వస్త్రాన్ని వేలంపాటలో పలువురు భక్తులు వాటిని దక్కించుకుంటారు.

అయితే అమ్మవారికి సమర్పించిన ఈ శేష వస్త్రాలను ధరించవచ్చా.ఒకవేళ ధరించినపుడు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

అమ్మవారికి సమర్పించిన శేష వస్త్రాన్ని భక్తులు ధరించ వచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

కానీ చీరలు ధరించిన మహిళలు వారి ఇష్టానుసారంగా మెలగకూడడు.ఎంతో పవిత్రమైన అమ్మవారి చీరలను ధరించినప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా మహిళలు అమ్మవారి నుంచి దక్కించుకున్న చీరలను సరైన సమయం, ముహూర్తం చూసి ధరించాలి.

అది శుక్రవారం అయితే మరీ మంచిది.ఈ విధంగా ధరించిన చీరలను ఉదయం కొద్దిసేపు మాత్రమే ధరించి తీసివేయాలి.

తీసివేసిన ఈ చీరను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శుభ్రమైన నీటితో కడిగి ఆ నీటిని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే చెట్లకు పోయాలి.

"""/" / ఈ విధంగా అమ్మవారికి సమర్పించిన చీరలు ధరించినపుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా మహిళలు రాత్రి సమయంలో ఈ చీరను ధరించకూడదు.ఈ చీరను ధరించి పడకగదిలోకి అసలు వెళ్ళకూడదు.

ఈ విధంగా అమ్మవారి చీరను ధరించిన వారు ఇలాంటి నియమాలను పాటించినప్పుడే అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

అయితే అమ్మవారికి చీరలు కేవలం ప్రసిద్ధి చెందిన ఆలయాల నుంచి మాత్రమే కాకుండా గ్రామాలలో అమ్మవారికి సమర్పించిన శేష వస్త్రాలను తీసుకున్న మనకు ఒకటే ఫలితం ఉంటుంది.

అదే విధంగా నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.

రాజ్యసభకు మెగాస్టార్… క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ సుస్మిత?