పిల్లలపై వేసిన భోగిపళ్ళను తిరిగి తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది?

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 14 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

జనవరి 14వ తేదీ భోగి పండుగను జరుపు 15వ తేదీ మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాము.

ఇక భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరు తమ పిల్లలపై భోగి పళ్ళు వేయడం ఆనవాయితీగా వస్తోంది.

సైన్స్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా భోగి పళ్ళు పిల్లలపై వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే భోగి పళ్ళను ముందుగా తల్లి పిల్లలపై భోగి పళ్ళు వేసి వారిని ఆశీర్వదించాలి అనే విషయం మనకు తెలిసిందే.

ఇలా ప్రతి ఒక్కరు భోగి పళ్ళు వేసిన తర్వాత అనంతరం కింద పడిన భోగి పళ్ళను తింటారు.

నిజానికి భోగిపళ్ళను ఎవరు తినకూడదు.అయితే ఈ భోగి పళ్ళు ఎందుకు తినకూడదు అనే విషయానికి వస్తే.

భోగిపళ్ళను పిల్లలపై వేయటం వల్ల వారిపై ఉన్న చెడు దృష్టి తొలగి పోతుందని భావిస్తాము.

ఈ క్రమంలోనే భోగి పళ్ళను మూడుసార్లు కుడి వైపుకి తిప్పి మరో మూడు సార్లు ఎడమవైపుకు తిప్పి వారిపై పోయడం వల్ల వారిపై ఉన్న చెడు వెస్తే తొలగిపోతుంది.

"""/" / ఇలా పిల్లలపై ఉన్న దిష్టితీస్తూ కింద పడిన భోగి పళ్ళను తినటం మంచిది కాదని చెబుతారు.

అందుకోసమే కింద పడిన భోగి పళ్ళను ఎవరు తినకుండా వాటిని ఒక సంచిలో తీసుకొని ఎవరూ తొక్కని ప్రదేశములో, లేదా బావిలో పడేయాలి.

అంతే కానీ ఆ భోగి పళ్ళను ఎవరూ తినకూడదు.భోగి పళ్ళు పిల్లలపై వేయడం వల్ల వారిపై ఉన్న చెడు ప్రభావం తొలగిపోవడమే కాకుండా నారాయణుడి అనుగ్రహం పిల్లలపై ఉండి పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారనే విషయం తెలిసిందే.

ఆ పోస్టుకు లైక్ కొట్టిన సమంత… విడాకులపై క్లారిటీ ఇచ్చిందా?