చిరంజీవి ఫెయిలైన చోట రామ్ చరణ్ సక్సెస్ సాధించడం సాధ్యమేనా?
TeluguStop.com
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొద్దిరోజులుగా అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లతో పాటు ఈవెంట్ కోసంఅక్కడే ఉంటున్నారు చెర్రీ.పద్యంలోనే అక్కడి మీడియాకు పలు రకాల ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ డెబ్యూ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని త్వరలోనే ఈ విషయంపై శుభవార్త రాబోతోంది అని తెలిపారు పవన్.
"""/" /
ఇకపోతే 1998లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 50 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఒక ఇంగ్లీష్ సినిమాను మొదలుపెట్టారు.
అయితే ఇండియన్ వర్షన్ కి సురేష్ కృష్ణని దర్శకుడుగా తీసుకోగా వెస్ట్ వెర్షన్ కి భూషణ్ జెర్సీ ని తీసుకున్నారు.
ఆ సినిమా టైటిల్ అబు బాగ్దాద్ గజదొంగ.ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో పత్రికలు ఈ సినిమా వార్తలతో ఊగిపోయాయి.
అప్పట్లోనే జాతీయ పేపర్లలో కూడా విపరీతమైన కవరేజ్ వచ్చింది.ఎట్టకేలకు సినిమా షూటింగ్ కొంచెం పూర్తి కాగా అనుకోకుండా వరుసగా వివాదాలు వచ్చి పడ్డాయి.
సినిమాలోని ఒక సన్నివేశంలో ఖురాన్ నీ అవమానించారని మరొక సన్నివేశంలో సూర్య భగవానుడిని తప్పుగా చూపించారు అంటూ వివిధ సంఘాలు కోర్టు మెట్లు ఎక్కాయి.
"""/" /
అప్పటికే బడ్జెట్ చేయి దాటి పోవడంతో నిర్మాత కనిపించడం లేదు.
దాంతో కేసులను ఎదురుకోలేక ముందే సినిమా షూటింగ్ ఆపేశారు.తర్వాత మళ్లీ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టలేదు.
అలా చిరంజీవి హాలీవుడ్ సినిమాలో నటించే ఫెయిల్ అయ్యాడు.ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది.
స్టేట్మెంట్ అయితే పెద్దదే ఇచ్చాడు కానీ నిజానికి కార్యరూపం దాల్చడం కీలకం అని చెప్పవచ్చు.
మరి చిరంజీవి ఫెయిల్ అయిన చోట రామ్ చరణ్ సక్సెస్ అవుతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
చెర్రీ తన తండ్రి ఫెయిల్ అయిన చోట తాను సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.
కాఫీ డార్క్ సర్కిల్స్ ను పొగొడుతుందా?