రోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చా.. అసలు వాటి ప్రయోజనాలేంటి?
TeluguStop.com
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ చాలా బిజీగా మారిపోయింది.డబ్బు సంపాదనలో పడి సగం శాతం మంది తినడం కూడా మర్చిపోతున్నారు.
ఇంకొందరు కేవలం ఆకలిని తీర్చుకోవడం కోసం ఏదో ఒక చెత్తను కడుపులోకి తోసేస్తున్నారు.
దీని కారణంగా శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందవు.ఫలితంగా అనేక జబ్బులు తలెత్తుతుంటాయి.
అయితే ఆ జబ్బులకు దూరంగా ఉండటం కోసమే కొందరు తెలివిగా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు.
మరి రోజూ మల్టీ విటమిన్ టాబ్లెట్స్( Multivitamin Tablets ) ను తీసుకోవచ్చా.
? అసలు వాటి వల్ల ప్రయోజనాలేంటి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం..
మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ను ఎలాంటి భయం లేకుండా రోజూ తీసుకోవచ్చు.కానీ, నిపుణులు సూచించినట్లు సరైన వ్యవధిలో మరియు సరైన మొత్తంలో తీసుకోవాలి.
అధికంగా వాటిని తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తుంటాయి. """/" /
ఇక మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ప్రయోజనాలను పరిశీలిస్తే.
మీ రెగ్యులర్ డైట్ లో లేని విటమిన్లు మరియు ఖనిజాలను ఈ టాబ్లెట్స్ ద్వారా పొందవచ్చు.
అలాగే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ను వాడటం వల్ల నీరసం, అలసట( Lethargy ) వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు.అనేక రకాల ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్య సమస్యల నుంచి ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ మిమ్మల్ని కాపాడుతాయి.
"""/" /
మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ను నిత్యం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి( Memory ), ఏకాగ్రత చక్కగా పెరుగుతాయి.
మెరుగైన మానసిక స్థితికి మల్టీ విటమిన్లు దోహదం చేస్తాయి.అంతేకాదు, మల్టీ విటమిన్లు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.
హెయిర్ ఫాల్ సమస్య కు చెక్ పెడతాయి.మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
గట్ హెల్త్ పెరుగుతుంది.ఎనర్జీ లెవెల్స్ సైతం రెట్టింపు అవుతాయి.
ఇక జుట్టు ఎంత పల్చగా ఉన్న నో వర్రీ.. ఈ సీరం తో దట్టంగా మార్చుకోండి!