టైం చూసి బాంబు పేల్చిన మోడీ?

గత కొంతకాలం క్రితం వరకు బిజెపి( BJP ) జాతీయ నాయకత్వానికి సన్నిహితంగా మెలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( Kcr ) కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

అంతేకాక తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు.అయితే వీరిద్దరికి మధ్య ఎక్కడ చెడింది అన్న విషయంపై మాత్రం ఇప్పటివరకూ ఎక్కడా క్లారిటీ లేదు.

అయితే ఆ సస్పెన్స్ కి ప్రధాని మోదీ( Prime Minister Modi ) ముగింపు పలికేశారు.

తన కళ్ళలోకి చూసే ధైర్యం లేకపోవడం వల్లే కేసీఆర్ తనను ఆహ్వానించడానికి రావడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నిజాయితి గా తన మనసు విప్పుతున్నానంటూ గతం లోకి వెళ్లారు .రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఢిల్లీ వచ్చి తనను కలిసిన కేసిఆర్ రాజకీయ ప్రయాణంలో తాను అలసిపోయానని ,తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలంటూ నన్ను కోరారు.

అయితే ఇది ప్రజాస్వామ్య దేశం అని రాచరికం కాదని ఇందులో యువరాజులంటూ ఎవరూ ఉండరని నేను తేల్చి చెప్పాను .

అంతేకాకుండా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై కూడా నేను కేసీఆర్ ముఖాన్నే ప్రశ్నించాను .

అందువల్ల అప్పటి నుంచి నన్ను కలవడానికి ఆయనకు మొహం చేల్లడం లేనట్లు ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు .

"""/" / అంతేకాకుండా అనేక కష్టాలను ఓర్చి తెచ్చుకున్న తెలంగాణ ఫలాలను ఒకే కుటుంబం అనుభవిస్తుందని, తెలంగాణ ప్రజలు సమర్ధత ,శక్తి సామర్థ్యాలు కలవారని, దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదని, అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసే సత్తా ఉన్న వారికి ఇక్కడ కొదవ లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు .

ఏది ఏమైనా కాంగ్రెస్ ,బిజెపితో( Congress , BJP ) పోలిస్తే రేసులో ముందుకు దూసుకు వెళ్తున్న బారాసకు మోడీ వ్యాఖ్యలు స్పీడ్ బ్రేకర్ గానే చెప్పవచ్చు.

ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కన్నా తన కుటుంబ సంక్షేమమే ముఖ్యం అన్నట్టుగా కేసీఆర్ వైఖరి ఉందన్న స్వయంగా ప్రధాని కన్ఫామ్ చేయడంతో ఇది ఎన్నికలవేళ బారసా కు కొంత వ్యతిరేకము గా మారవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి మరి ప్రధాని వ్యాఖ్యలపై బారాశా అధినాయకత్వం ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.

ఈ ఇద్దరి చేతిలో దెబ్బలు తిన్న నాగార్జున.. పనులు చేయకపోతే అలా బిహేవ్ చేసేవారా?