చిరు తన రికార్డును తానే బ్రేక్ చేస్తాడా.. వీరయ్య స్టామినా ఎంత?
TeluguStop.com
మెగాస్టార్( Megastar ) సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మెగా ఫ్యాన్స్ కు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి మంచి మాస్ ట్రీట్స్ అయితే ఇస్తున్నాడు.
అయితే మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో కొన్ని ప్లాప్ అవుతుంటే మరికొన్ని సూపర్ హిట్ అవుతున్నాయి.
మరి మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ హిట్ సాధించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'( Waltheru Veeraya ).
ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.
"""/" /
ఈ సినిమాను బాబీ ( Bobby )డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా తాజాగా స్మాల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చి మంచి టీఆర్పీ సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ ఇప్పుడు తమిళ్ వర్షన్ లో కూడా వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కాబోతుంది.
రేపు అక్టోబర్ 29న విజయ్ టెలివిజన్ ఛానెల్లో ప్రసారం కానుంది.ఇక ఇప్పటికే మెగాస్టార్ గత సినిమా సైరా నరసింహారెడ్డికి తమిళ్ బుల్లితెరపై భారీ టీఆర్పీ వచ్చింది.
ఏకంగా 15.44 టీఆర్పీ నమోదు చేసుకుంది.
మరి ఈ సినిమా రికార్డును మెగాస్టార్ వాల్తేరు వీరయ్య బీట్ చేస్తుందో లేదో చూడాలి.
ఈ ప్రోటీన్ మాస్క్ తో మీ కురులు అవుతాయి డబుల్..!