సీతాఫలం తినడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయా..
TeluguStop.com
మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సీజన్లో ఒక్కోరకమైన పండ్లు ప్రకృతి మనకు అందిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం సీతాఫలం సీజన్ నడుస్తూ ఉండడంవల్ల ఈ పండ్లు ఎక్కువగా దొరుకుతున్నాయి.ఈ సీతాఫలాన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు.
ఎందుకంటే ఈ పండ్లు అంత రుచిగా ఉంటాయి కాబట్టి.ఈ సీతాఫలాలలు రుచిగానే కాకుండా వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.
ఈ పండ్లను తిన్న వెంటనే శరీరానికి శక్తిని అందిస్తాయి.ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ పండ్లలోని గుజ్జు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
సీతాఫలం చెట్టు ఆకులు, గింజలలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి.ఇవి కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ పండు సంజీవినిలా ఉపయోగపడుతుంది.అయితే సీతాఫలం ఎటువంటి వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ పై వీటిలో ఉండే విటమిన్ సి సమర్థవంతంగా వాటితో యుద్ధం చేస్తుంది.
"""/"/
ఒక సంవత్సరం పాటు ఇబ్బంది పడే ఎటువంటి వ్యాధినైనా ఈ పండు తినడం వల్ల దూరం చేయవచ్చు.
అలాగే జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ ఎంతో సహాయపడుతుంది.
అలాగే ఈ పండు గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.ఈ పండుని చలికాలంలో తీసుకోవడం వలన మలబద్దకాన్ని నివారిస్తుంది.
దీనిలో ఉండే కాపర్ గుణాలు బరువు తక్కువగా ఉన్నవాళ్లు బరువు పెరగాలి అనుకునేవారు సీతాఫలాలను ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారు.
అలాగే ఈ చెట్టు యొక్క ఆకుల రసాన్ని గాయల పై రాయడం వల్ల గాయాలు త్వరగా తగ్గిపోతాయి.
గర్భవతులు సీతాఫలం పండుని తినడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది.