మధుమేహం ఉన్నవారు నెయ్యి తినవచ్చా..?
TeluguStop.com
భారతీయ వంటకాల్లో నెయ్యి( Ghee ) ప్రధానమైనది.వంటల్లో నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు.
అనేక రకాల స్వీట్స్ తయారీలో నెయ్యి అతి ముఖ్యమైనది.గొప్ప రుచి మరియు పోషక విలువల కారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు నెయ్యిని ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.
అయితే మధుమేహం( Diabetes ) ఉన్న వారు నెయ్యి తినవచ్చా? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.
మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి.మధుమేహం బారిన పడితే శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు లేదా దానిని సమర్థవంతంగా ఉపయోగించదు.
ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తుంది.అందుకే మధుమేహం ఉన్నవారు ఆహారం ఎంపికలో చాలా జాగ్రత్తలు వహించాలి.
ఇకపోతే మధుమేహం ఉన్నవారు నెయ్యిని ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు.నిజానికి మధుమేహులు నెయ్యిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
నెయ్యిలో కొవ్వులు మరియు కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లకు నెయ్యి గొప్ప మూలం.అందువల్ల నెయ్యి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
"""/" /
అలాగే నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు( Fatty Acids ) గ్లూకోజ్ జీవక్రియకు సహాయపడతాయి.
మధుమేహుల్లో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.అయితే నెయ్యిలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ మరియు సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి( Heart Health ) మేలు చేస్తాయి.
గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కె ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.
"""/" /
నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పని చేస్తాయి.
నెయ్యిలో కార్బోహైడ్రేట్లు ఉండవు కాబట్టి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు.
నెయ్యి గ్లూకోజ్ స్థాయిలను పెంచకుండా శక్తిని అందించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
కాబట్టి, మధుమేహం ఉన్నవారు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా నెయ్యిని తీసుకోవచ్చు.కానీ లిమిట్ గా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.
వీడియో వైరల్: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో కాల్పులు