చికెన్ వండేటప్పుడు పెరుగు వాడవచ్చా.. వాడకూడదా..

సాధారణంగా దమ్ బిర్యానీ లేదా చికెన్ వండేటప్పుడు చికెన్ ముక్క జ్యూసీగా ఉండడానికి పెరుగు కలుపుతూ ఉంటారు.

ఈ కలయిక రుచి పరంగా సరైనది అయినా ఆరోగ్యపరంగా చెడు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం పాటించే ఆహార నియమాల్లో కొన్నిటి వల్ల జీర్ణక్రియ మార్గాల్లో అడ్డంకి సృష్టించి శరీరానికి అవసరమైన పోషకాలను పొందకుండా నిరోధిస్తాయని చెబుతున్నారు.

కొన్ని ఆహార సమ్మేళనాలను నివారించడం మన ఆరోగ్యం, వైద్యం మరియు జీర్ణ క్రియను మెరుగుపరచడంతో ఉపయోగపడుతుంది.

కొన్ని వినడానికి కొత్తగా ఉన్న ప్రాచీన ఆయుర్వేద విధానం ప్రకారం అవే మంచివనీ చెబుతున్నారు.

ఆయుర్వేద నిపుణులు తెలిపిన ఆ చెడు పదార్థాల కలయిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ చాలా మంది భోజనం చేసే సమయంలో కచ్చితంగా నీరు త్రాగుతూ ఉంటారు.

అయితే ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల కడుపులోని ఆమ్లాలను పలుచనా చేస్తుంది.

అలాగే ప్రోటీన్లు కొవ్వులు కార్బోహైడ్లైన్లను విచ్చిన్నం చేసి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది.భోజనానికి ముందు నీరు తాగితే పర్లేదు కానీ భోజనం చేసే సమయంలో మాత్రం అధికంగా నీరు సేవించవద్దని నిపుణులు చెబుతున్నారు.

"""/"/ సాధారణంగా పెరుగు అన్నం లో ఖచ్చితంగా ఏదో పండు తినే అలవాటు చాలామందికి ఉంటుంది.

కొంతమంది పెరుగు అన్నం లో మామిడిపండు వేసుకుని తింటూ ఉంటారు.అయితే పండ్లలో ఉన్న చక్కెరపై పనిచేసే బ్యాక్టీరియాలు పెరుగులో ఉన్నాయి.

ఇది జలుబు, అలర్జీలకు దారి తీయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.పెరుగు అన్నం తినే సమయంలో పండ్లను దూరంగా పెట్టడమే మంచిది.

చాలామంది చిన్నపిల్లలు అల్పాహారం లో బ్రెడ్, జామ్ ఇస్తూ ఉంటారు.పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు.

కానీ ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉండే పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ ప్రోటీన్లు కొవ్వును కలిగి ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే పాలు, తృణధాన్యాలు రెండు కలిపి తీసుకోకూడదు.

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం..: మల్లు రవి