ఆ విషయంలో నాతో ఎవరు పోటీ పడలేరు… తన టాలెంట్ బయటపెట్టిన జాన్వీ!

దివంగత నటి అందాల తార శ్రీదేవి( Sridevi ).వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్( Janhvi Kapoor ).

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నటువంటి ఈమె తెలుగులో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలోనే ఈమె కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా( Devara ) ద్వారా సౌత్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు.

ఇలా సౌత్ సినిమా అవకాశాలను అందుకుంటూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ జాన్వీ కపూర్ ఎంతో బిజీగా ఉన్నారు.

"""/" / ఇకపోతే తాజాగా ఈమె నటించిన బావాల్ సినిమా శుక్రవారం విడుదలైంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి ఈమె తనలో ఉన్నటువంటి ఓ టాలెంట్ బయట పెట్టారు.

ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ తాను చదువుకునే సమయంలో తన ఫేవరెట్ సబ్జెక్టు హిస్టరీ ( History )అని తెలిపారు.

ఇక ఈమె నటించిన ఈ సినిమా కూడా చరిత్ర వర్తమాన అంశాలతో కలిసి ఉండటంతో ఈ విషయం గురించి జాన్వీ మాట్లాడుతూ ఇలా చరిత్ర ప్రస్తావన ఉన్న సినిమాలలో నటించడం గొప్ప అనుభవమని తెలిపారు.

"""/" / ఇక ఈమె మాట్లాడుతూ తాను స్కూల్లో చదివేటప్పుడు నుంచి తనుకు హిస్టరీ అంటే చాలా ఇష్టం హిస్టరీకి సంబంధించి ఎలాంటి వ్యాసరచన పోటీలు పెట్టిన బహుమతులు మొత్తం నాకే వచ్చేవని తెలిపారు.

మిగతా సబ్జెక్ట్స్ విషయంలో నాకు పెద్దగా అవగాహన లేకపోయినా హిస్టరీలో మాత్రం చాలా మంచి అవగాహన ఉందని, హిస్టరీ విషయంలో మాత్రం నాకు ఎవరు పోటీ పడలేరు అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తనలో ఉన్నటువంటి మరో టాలెంట్ ని బయటపెట్టారు.

ఇకపై భవిష్యత్తులో ఇలా చారిత్రక కథాంశాలతో కూడిన సినిమాలు కనుక వస్తే తను అసలు వదులుకోనని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?