అదానిపై బాబు చర్యలు తీసుకుంటారా ? ఒత్తిడి పెరుగుతోందా ?
TeluguStop.com
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు( CM Chandrababu ) పెద్ద చిక్కే వచ్చి పడింది.
కేంద్ర బిజెపి పెద్దలకు అత్యంత సన్నిహితులు , ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని పై( Gautam Adani ) అమెరికాలో కేసు నమోదవడం, గత వైసిపి ప్రభుత్వం లో అదానీ ఎనర్జీ సరఫరా చేసే సౌర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకి ) తో కుదుర్చుకున్న ఒప్పందంలో గత వైసిపి ప్రభుత్వం పెద్దకు 1750 కోట్లు ముడుపులు అందినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎస్బిఐ నిర్ధారించింది.
దీనిపై అమెరికా కోర్టులోను అభియోగాలు నమోదయ్యాయి .ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది.
గౌతమ్ ఆదాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
"""/" /
అదానితో జగన్( Jagan ) కుదుర్చుకున్న 7వేల కోట్ల సౌర విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని , దీనిపై సిబిఐ విచారణ చేయించాలనే డిమాండ్ పెరుగుతోంది.
ఇప్పటికే పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) ఇదే డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ ఒప్పందం విషయంలో చంద్రబాబు నోరు మెదపడం లేదని, అదానీ నుంచి మీకు కూడా ఆఫర్లు అందాయా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు.
ఇక సిపిఐ నేత రామకృష్ణ( CPI Ramakrishna ) కూడా ఇదే విషయంపై స్పందిస్తున్నారు.
ఆదానితో డీల్ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు 100 కోట్లు వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా రామకృష్ణ ప్రస్తావిస్తున్నారు.
"""/" /
జగన్ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న సోలార్ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుండడం, దీనిపై సిబిఐ లేదా సెట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనే డిమాండ్ లు పెరుగుతున్నాయి .
ఇక ఏపీలో ఆదానికి ప్రాజెక్టు కాకుండా , కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా గత వైసిపి ప్రభుత్వం హయాంలో కట్టబెట్టారు.
ఇంకా అనేక రంగాల్లో ఏపీలో ఆదాని భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటి పైన విచారణ చేయించాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అదానీ విషయంలో చంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది తేలాల్సి ఉంది.
ఇక పాత పాన్ కార్డులు పని చేయవా? కేంద్రం ఏం చెబుతోంది?