హామీల అమలు ఇప్పట్లో కష్టమేనా  ? బాబు పై ఒత్తిడి పెరుగుతోందా ? 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబుపై( CM Chandrababu ) ఒత్తిడి పెరుగుతోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్( Super Six ) హామీలతో పాటు , మిగతా హామీల అమలు ఎప్పుడంటూ విపక్షాలతో పాటు,  జనాలు  ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పుకునే పరిస్థితిలో లేకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.

ప్రస్తుతం ఏపీ ఖజానా చూస్తే ఖాళీగా ఉంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలంటే ,ఏడాదికి 1,50,000 కోట్లు అవసరం అవుతాయి.

దీంతోపాటు మిగతా అభివృద్ధికి సొమ్ములు ఖర్చు పెట్టాల్సి ఉండడంతో,  అంత బడ్జెట్ ను ప్రస్తుతం కేటాయించే పరిస్థితిలో లేకపోవడంతో ఈ హామీల అమలు ఎలా అనే విషయంలో చాలా రోజులుగా తర్జన భర్జన పడుతున్నారు.

గెలిచామనే ఆనందం కంటే ఈ హామీలను ఏ విధంగా అమలు చేయాలనే విషయంలోనే ఎక్కువ టెన్షన్ పడుతోంది.

ఏపీలో అధికారంలోకి వచ్చి అప్పుడే రెండు నెలలు అవుతోంది. """/" / ఖజానా ఖాళీగా ఉందని, ఇప్పట్లో ఆ హామీలను అమలు చేయడం సాధ్యం కాదన్నట్లుగానే చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు.

సూపర్ సిక్స్ హామీలతో పాటు , మ్యానిఫెస్టో లో( Manifesto ) అనేక పథకాలను  ఎన్నికల ముందు  ప్రకటించారు.

ఆ పథకాలను ప్రకటించిన సమయంలోనే అసలు అమలు సాధ్యమా అనే ప్రశ్నలు ఎన్నో తలెత్తినా,  సంపద సృష్టించి మరి ఈ హామీలను అమలు చేస్తామని,  ఏపీని అభివృద్ధి బాటలు పట్టిస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు .

అయితే ఇప్పుడు వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4000 చేస్తామని చెప్పారు.

  దానిని అమలు చేశారు.ఇక అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నాటికి 100 వరకు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

అన్న క్యాంటీన్లలో పది రూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించారు.దీంతో పాటు మెగా డిఎస్సి ని( Mega DSC ) ప్రకటించారు.

"""/" / దాదాపు 15 వేల పోస్టులను భర్తీ చేయబోతున్నారు.దీనికోసం టెట్ ను నిర్వహించనున్నారు.

ఇంకా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం , కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీలు , మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు.

అలాగే 50 ఏళ్లు నిండిన బీసీలు అందరికీ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు.

ఆ ప్రస్తావన లేదు.రైతు భరోసా నిధులు జమ కాలేదు.

రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదు.అలాగే తల్లికి వందనం కార్యక్రమం కింద ఒక్కో విద్యార్థికి 15000 ఇస్తామన్న హామీ కూడా అమలు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

  అంతా బాగుంటే వచ్చే ఏడాది దీనిని అమలు చేస్తామని చెబుతున్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాము ప్రయత్నిస్తున్నా.

ఖాళీ ఖజానా ఉండడంతో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని పైకి చెబుతున్నా,  దీనిని అవకాశం గా తీసుకుని వైసిపి, టిడిపి కూటమిని  టార్గెట్ చేసుకుని  చంద్రబాబు అధికారంలోకి వచ్చేవరకు ఒకలా,  వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించడం , గతంలో అనేక సార్లు చూసామని , ఆయన హామీలను అమలు చేయడం అసాధ్యమని వైసిపి విమర్శలు చేస్తున్నా.

  దీనిని గట్టిగా తిప్పుకొట్టలేని పరిస్థితుల్లో టిడిపి కూటమి ఉంది.

టీడీపీ కి గవర్నర్ పదవి ..  ఈ ముగ్గురిలో బాబు ఛాయిస్ ఎవరో ?