భారత్‌లో కెనడా కొత్త రాయబారిగా కెమరూన్ మాకాయ్..!!

భారత్‌లో కెనడా కొత్త హైకమీషనర్‌గా కెమరూన్ మాకాయ్‌ని ఆ దేశ ప్రభుత్వం నియమించింది.

ఈ వేసవిలో నాదిర్ పటేల్ తప్పుకున్న తర్వాతి నుంచి ఆ పదవి ఖాళీగా వుంది.

కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

అలాగే భారత్‌లోని కెనడా కాన్సులేట్‌లలో మార్పులు సైతం చోటు చేసుకున్నాయి.బెంగళూరు, చండీగఢ్, ముంబైలలో కొత్త కాన్సుల్ జనరల్‌లు బాధ్యతలు స్వీకరించారు.

ఇక కెమరూన్ విషయానికి వస్తే.ఇండోనేషియా, తైమూర్ - లెస్టేలకు ఇప్పటివరకు రాయబారిగా సేవలందించారు.

వాణిజ్య పరమైన అంశాలలో ఆయనకు మంచి పట్టుంది.జకార్తాలో పనిచేసిన అనుభవం కారణంగా ఇండో - పసిఫిక్‌కు సంబంధించిన సమస్యలపై అవగాహన వుంది.

కెమరూన్ మాకాయ్ 1995లో కెనడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో చేరారు.

2008-10 నుంచి ప్రాంతీయ వాణిజ్య విధానానికి డైరెక్టర్‌గా, 2012-13 నుంచి చైనా ట్రేడ్ పాలసీ డైరెక్టర్ జనరల్‌గా, 2013-15 నుంచి ట్రేడ్ నెగోషియేషన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.

2015-17 నుంచి ట్రేడ్ సెక్టార్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/12/Cameron-Mackay-appointed-as-Canada’s-envoy-to-India!--jpg" / భారత్‌లో కెనడా ముగ్గురు కాన్సులేట్ జనరల్స్‌ను ఏకకాలంలో మార్చడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

అన్నీ డ్యూబే స్థానంలో డైద్రా కెల్లీ ముంబై కాన్సుల్ జనరల్‌గా, మియా యెన్ స్థానంలో పాట్రిక్ హెబర్ట్ చండీగఢ్‌ కాన్సుల్ జనరల్‌గా, నికోల్ గిరార్డ్ స్థానంలో బెనాయిట్ ప్రిఫోంటైన్ బెంగళూరు కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

కెనడా- భారత్‌ల మధ్య సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య బప్పందం (సీఈపీఏ), ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ (ఎఫ్‌ఐపీఏ)లు వున్నందున ఈ కొత్త నియామకాలు చోటు చేసుకున్నాయి.

ఇటీవలి కాలంలో ఇరుదేశాల మధ్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో బుధవారం కెనడా అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి, చిన్న వ్యాపారం, ఆర్ధికాభివృద్ధి శాఖ మంత్రి మార్గ్ ఎన్‌జీ.

భారత వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు జరిపారు.కెనడా-భారత్ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం, కెనడా- భారత్ విదేశీ పెట్టుబడుల ప్రమోషన్, రక్షణ ఒప్పందంపై మరోసారి చర్చలను ఇద్దరు మంత్రులు స్వాగతించారు.

ఒప్పందాలను చేరుకోవడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి వున్నామని గ్లోబల్ అఫైర్స్ కెనడా ఒక ప్రకటనలో పేర్కొంది.

వేట్టయాన్ టైటిల్ వివాదం గురించి క్లారిటీ ఇదే.. ఆ రీజన్ వల్లే పెట్టలేదంటూ?