వైరల్: పొరపాటున రాంగ్ బటన్ నొక్కింది.. రూ.75 కోట్లు గెలుచుకుంది.. అదెలాగంటే..!

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరు చెప్పలేరు.అలానే ఒక్కోసారి చెడ్డ వ్యక్తుల వల్ల కూడా మనకు మంచే జరుగుతుంది.

తాజాగా ఓ సంఘటన ఈ రెండు స్టేట్మెంట్స్ ని నిజం చేసింది.ఒక బ్యాడ్ పర్సన్ వల్ల ఒక మహిళని అదృష్టం వరించింది.

ఆ అదృష్టంతో ఆమె ఒక్క రోజులోనే 10 మిలియన్ డాలర్స్ (సుమారు రూ.

75 కోట్లు) సొంతం చేసుకుంది.ఇప్పుడు ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

వివరాల్లోకి వెళితే.కాలిఫోర్నియా నగరానికి చెందిన లాక్వెట్రా ఎడ్వర్డ్స్ అనే ఒక మహిళ 40 డాలర్ల విలువైన లాటరీ టిక్కెట్ కొనుగోలు చేయాలనుకుంది.

ఈమె నవంబర్ 2021లో లాస్ ఏంజిల్స్‌లోని వాన్స్ సూపర్‌మార్కెట్‌లో ఓ లాటరీ మెషిన్‌లో 40 డాలర్లు ఉంచి అందులో తనకు నచ్చిన ఒక టిక్కెట్ కొనుగోలు చేయాలనుకుంది.

అయితే ఆమె టికెట్ నంబర్‌ను ఎంచుకుంటున్న సమయంలో ఒక బ్యాడ్ పర్సన్ ఆమెకు వెనకనుంచి డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

ఈ క్రమంలో ఆమె వేళ్లు పొరబాటున వేరే బటన్ పై పడ్డాయి.అంతే, 30 డాలర్ల విలువైన 200X స్క్రాచర్స్ టిక్కెట్‌ను ఆమె పొరపాటున కొనుగోలు చేసింది.

"""/"/ "అతను నాకు ఢీకొట్టాడు, ఏమీ మాట్లాడకుండా, తలుపు నుంచి బయటికి వెళ్ళిపోయాడు" అని ఎడ్వర్డ్స్ వెల్లడించింది.

అయితే అతని చేసిన ఆ పని వల్ల తాను అనుకోకుండా ఒక టిక్కెట్ కొనుగోలు చేశానని, దానికి 10 మిలియన్ల డాలర్ల లాటరీ తగిలిందని ఆమె చెప్పింది.

"నేను కొన్న టికెట్‌కే $10 మిలియన్ల జాక్‌పాట్ ప్రైజ్ తగలడం నా అదృష్టం" అని ఆమె సంతోషంతో చెప్పుకొచ్చింది.

"""/"/ "ఈ గుడ్ న్యూస్ తెలిసినప్పుడు నేను కారు నడుపుతున్నాను.దీని నమ్మలేక నేను షాక్ అయ్యాను.

ఆ టైంలో కారుని క్రాష్ చేసేంత పని అయ్యింది" అని నవ్వుతూ ఆమె చెప్పుకొచ్చింది.

కాలిఫోర్నియా లాటరీ మొబైల్ యాప్‌లో టిక్కెట్‌ను స్కాన్ చేసి తనకి నిజంగానే భారీ లాటరీ తగిలిందా లేదా అని ఆమె చెక్ చేసుకుంది.

అది నిజమే అని తెలిసినా కూడా ఆమె చాలాసేపు షాకులోనే ఉందట.ఎడ్వర్డ్స్ లాటరీ డబ్బులతో ఒక మంచి హౌస్ కొనుగోలు చేసి మిగతా డబ్బులతో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుందట.

వావ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి అమ్యూజ్‌మెంట్‌ పార్క్.. అంతా ఏఐ మహిమ..!