కుక్క బర్త్ డేకు అదిరిపోయే గిఫ్ట్.. బంగారం అక్షరాలతో చెక్కిన లక్షల విలువైన ఇల్లు
TeluguStop.com
ఈ మధ్య తమ ఇళ్లల్లో ప్రతిఒక్కరూ పెంపుడు కుక్కలను( Pet Dog ) పెంచుకుంటున్నారు.
వివిధ రకాల జాతుల కుక్కలను పెంచుకుంటున్నారు.వాటిని తమ సొంత కుటుంబసభ్యులా భావిస్తున్నారు.
ఒకప్పుడు సిటీలలో ఎక్కువగా పెంపుడు కుక్కలను పెంచుకునేవారు.ఇప్పుడు ఈ సంస్కృతి పట్టణాలు, పల్లెలకు కూడా పాకింది.
పల్లెల్లో కూడా ఇటీవల కాలంలో చాలామంది పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు.పెంపుడు కుక్కలకు ఆహారం పెట్టి పెంచుకోవడమే కాదు.
వాటిని మనుషుల్లాగే స్నానాలు చేయించడం, చికెన్ లాంటి మంచి ఫుడ్ పెట్టడం లాంటివి చేస్తున్నారు.
అలాగే వాటికి కూడా బర్త్ డే( Birthday ) చేస్తున్నారు.వాకింగ్ కు తీసుకెళ్లడం, ఎక్కడైనా టూరిస్ట్ ప్రదేశాలకు వెళితే వాటిని కూడా తీసుకెళ్లడం లాంటివి చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కొంచెం మరో ముందడుగు వేశారు.పెంపుడు కుక్కకుక బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ లు కూడా ఇస్తున్నారు.
అలాంటి, ఇలాంటి గిఫ్ట్ లు కాదు.మంచి కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇస్తున్నారు.
"""/" /
తాజాగా కాలిఫోర్నియాలో( California ) వింత సంఘటన చోటుచేసుకుంది.25 ఏళ్ల బ్రెంట్ రివెరా అనే యువకుడు తాను పెంచుకుంటున్న కుక్కకు బర్త్ డే సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
దానికోసం అత్యంత ఖరీదైన ఇల్లు( Costly Home ) కట్టించాడు.కుర్చీలు, సోఫాపలు, బీన్ బ్యాగులు, ఫ్రిడ్జ్చ టీవతో పాటు బంక్ బెడ్, కాఫీ టేబుల్ లాంటివి ఇంట్లో అందుబాటులో ఉంచాడు.
కేవలం కుక్క కోసం ప్రత్యేకంగా ఈ ఖరీదైన ఇంటిని నిర్మించడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.
అయితే ఇతడి తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.కుక్కకు టీవీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
"""/" /
కుక్క టీవీ చేస్తుందా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.
టీవీలో కేవలం కుక్కకు నచ్చేవి ప్లే అయ్యేలా సెట్ చేశాను అంటూ యువకుడు సమాధానం ఇచ్చాడు.
ఇంటి బయట బంగారు అక్షరాలతో చార్లీ హౌస్ అని రాయించాడు.
బెంగళూరు వ్యక్తి జీనియస్ ఐడియా.. ట్రాఫిక్‌లోనే తెలివిగా మీటింగ్స్..?