అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. బరిలో నేను లేను, నా మద్ధతు బైడెన్‌కే : కాలిఫోర్నియా గవర్నర్
TeluguStop.com
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.
ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
వీరితో పాటు మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్, మాజీ ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హేలీ, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఇండో అమెరికన్ బిలియనీర్ వివేక్ రామస్వామిలు( Vivek Ramaswamy ) ఆ పార్టీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
"""/" /
అయితే డెమొక్రాటిక్ పార్టీలో మాత్రం పోటీ ప్రస్తుతానికైతే తక్కువగానే వుంది.
ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్( Gavin Newsom ) అధ్యక్ష బరిలో నిలుస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ కథనాలను గావిన్ కొట్టిపారేశారు.బైడెన్ మాత్రం పోటీలో వుంటారని.
శుక్రవారం ఎన్‌బీసీ మీట్ ది ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.తాను ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా గవర్నర్ పేర్కొన్నారు.
బైడెన్ వయస్సు పెద్ద అడ్డంకి కాబోదని గావిన్ స్పష్టం చేశారు.అలాగే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harri )కు కూడా ఆయన మద్ధతు ప్రకటించారు.
హారిస్‌తో గావిన్‌కు తొలి నుంచి సత్సంబంధాలే వున్నాయి.శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, యూఎస్ సెనేటర్‌గా వున్నప్పుడు కమలా హారిస్‌తో గావిన్ కలిసి పనిచేశారు.
"""/" /
ఈ ఏడాది ప్రారంభంలో ఫాక్స్ న్యూస్ సీన్ హన్నిటీలో కనిపించిన గావిన్ న్యూసోమ్.
ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పాలనా విధానంపై చర్చకు సవాల్ చేసి దుమారం రేపారు.
అప్పటి నుంచి గావిన్ కూడా అధ్యక్ష బరిలో నిలుస్తారంటూ పుకార్లు వ్యాప్తి చెందాయి.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల నిర్వహించిన పోల్‌లో 73 శాతం మంది నమోదిత ఓటర్లు బైడెన్ వయసుపై ( Joe Biden )సందేహాలు వ్యక్తం చేశారు.
ఒకానొక దశలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా 2024లో బరిలో దిగుతారని ప్రచారం జరిగింది.
అనిల్ రావిపూడి రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడా..?