కళ్లముందే నరకం: కార్చిచ్చులో చిక్కుకున్న స్నేహితులు.. భయానక వీడియో వైరల్..
TeluguStop.com
నిప్పుల కొలిమిలా మారిన లాస్ ఏంజెల్స్( Los Angeles ) నుంచి ఓ భయానక దృశ్యం వెలుగులోకి వచ్చింది.
మిన్నెసోటాకు చెందిన టానర్ చార్లెస్( Tanner Charles ) తన ఫ్రెండ్ ఇంటి నుంచి బయటపడిన షాకింగ్ వీడియోను ఎక్స్‌లో పంచుకున్నాడు.
తన స్నేహితుడు ఓర్లీ ఇజ్రాయెల్‌తో ఈ ఇంటి నుంచి బయట పడుతున్న దృశ్యాలు అందులో కనిపించాలి.
పసిఫిక్ పాలిసేడ్స్‌లో చెలరేగిన కార్చిచ్చు( Wildfire ) వారి ఇంటిని చుట్టుముట్టడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు పరుగులు తీయాల్సి వచ్చింది.
టానర్ షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు కాలిపోతున్న ఇళ్ల మధ్య భయంతో పరుగులు పెడుతూ కనిపించారు.
ఎటు చూసినా ఎర్రటి మంటలు, దట్టమైన పొగలు వారిని కమ్మేశాయి."నా స్నేహితుడి ఇంటి నుంచి వీలైనంత కాపాడుకోవడానికి ప్రయత్నించిన తర్వాత, మేం అక్కడి నుంచి బయలుదేరాల్సిన పరిస్థితి ఇది.
దయచేసి అతని కోసం, అతని కుటుంబం కోసం ప్రార్థించండి.ఈ సంఘటన రస్టిక్ కాన్యన్( Rustic Canyon ) ఉత్తర ప్రాంతంలో జరిగింది" అని టానర్ ఆ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు.
"""/" /
వాస్తవానికి, ఓర్లీ ఇజ్రాయెల్, అతని కుటుంబ సభ్యులను ఆ రోజు ఉదయం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా ఆదేశించారు.
అయినప్పటికీ, ఓర్లీ, టానర్ ముఖ్యమైన వస్తువులను కాపాడుకోవడానికి తిరిగి ఇంటికి వెళ్లారు.కార్లలో సామాన్లు సర్దుకుని, చిన్న మంటలను ఆర్పడానికి నీళ్లు చల్లుతూ, మండే అవకాశం ఉన్న ఫర్నిచర్‌ను లోపలికి చేర్చారు.
"""/" /
కానీ, కార్చిచ్చు ఊహించని విధంగా వేగంగా వ్యాపించింది.దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో కొద్ది అడుగుల దూరం కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
మంటల వేడిమి, ఉష్ణోగ్రత తీవ్రతతో వారు ప్రయత్నాలు విరమించుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత టానర్ తన స్నేహితుడి ఇల్లు తగలకముందు, తగలబడిన తర్వాత ఎలా ఉందో చూపిస్తూ ఫోటోలను షేర్ చేశాడు.
"మేం మా వంతు ప్రయత్నం చేశాం." అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చాడు.
ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఐదు కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తున్నాయి.1,80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మరో 2,00,000 మంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఈ ప్రమాదంలో వేలాది ఇళ్లు, భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
నేను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచింది అతనే.. సమంత క్రేజీ కామెంట్స్ వైరల్!